కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.సొంత పార్టీ నేతలే కత్తులు నూరుకుంటున్న పరిస్థితి నెల కొంది.
వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గట్టి పట్టుదలపై ఉన్న భూమా నాగిరెడ్డి అనుచ రుడు ఏవీ సుబ్బారెడ్డికి, భూమా కుమార్తె, మంత్రి అఖిల ప్రియలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది.భూమాకు అత్యంత నమ్మకస్తుడుగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డిని.
తన సీటుకు అడ్డం వస్తాడనే ఉద్దేశంతో మంత్రి అఖిల ప్రియ ఎప్పటికప్పుడు పక్కన పెడుతున్నారు.ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి తన విశ్వరూపం చూపించాడు.
మంత్రి అఖిల ప్రియను బహిరంగంగా విమర్శించడంతోపాటు.అడుగడుగునా ఆమెను విమర్శించడం ప్రారంభించాడు.
దీంతో ఈఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది.

మంత్రి అఖిల ప్రియ, ఏవీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.భూమాకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఆయన ప్రాణ స్నేహితుడు ఏవీ.సుబ్బారెడ్డిని నాగిరెడ్డి కుటుంబం దూరం పెట్టడం వెనుక కేవలం ఆళ్లగడ్డ సీటు వ్యవహారమేనని అందరికీ తెలిసిందే.నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిల తీరుతో ఏవీ వర్గం అసంతృప్తి గురైంది.పార్టీ గెలుపు కోసం విబేధాలు పక్కన పెట్టాలని అధినేత చంద్రబాబు పదే పదే కోరడంతో అఖిలతో సంబంధం లేకుండా సుబ్బారెడ్డి.
అప్పటి ఉపఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం కృషి చేశారు.అయినప్పటికీ.అఖిల ప్రియ.,.సుబ్బారెడ్డిని కలుపుకొని పోయేందుకు ఇష్టపడలేదు.పైగా ఇటీవల జరిగిన భూమా ప్రథమ వర్ధంతి సభకు కూడా ఏవీ ని పిలువలేదు.
దీనిపై ఏవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అఖిల మీద బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ తర్వాత తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఆళ్లగడ్డపై ఫోకస్ పెట్టారు.ఆళ్లగడ్డలో తన అనుచరులు కార్యకర్తలు మద్దతుదారులతో ఏవీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
అంతేకాదు, సిటీ కేబుల్‌లో మంత్రి అఖిలకు సంబంధించిన ప్రసారాలను పూర్తిగా నిలిపివేయించాడు సుబ్బారెడ్డి.ఈ పరిణామంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర అగాథం నెలకొంది.
ఈ పరిణామమే ఎన్నికల వరకు కొనసాగితే.పార్టీ పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని గ్రహించిన సీఎం చంద్రబాబు .ఇటీవల ఈ ఇద్దరు నేతలను కూడా తన వద్దకు పిలిపించుకుని పంచాయితీ పెట్టారు.మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల ను పిలిచి మాట్లాడారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి తన మనసులో మాటను చంద్రబాబు వద్ద వెల్లడించాడు.ఆళ్లగడ్డ టికెట్ తనకు కేటాయిం చాలని కోరాడు.భూమా కుటుంబానికి తాను చేసిన సేవను గుర్తుచేశారు.అయితే, ఇద్దరూ విభేదాలు పక్కనపెట్టి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని బాబు సూచించారు.
అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మరోసారి చర్చిస్తానని చెప్పారు.మొత్తానికి భూమా, ఏవీ వర్గాల విభేదాలతో నంద్యాల, ఆళ్లగడ్డలో టీడీపీ భవిష్యత్‌పై సందేహాలు మొదలయ్యాయి.
అయితే, ఆఫ్‌దిరికార్డుగా మాత్రం మంత్రి అఖిల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు.అదేసమయంలో నియోజకవర్గంలోనూ ఆమె టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా సొంత వ్యాపాలనే చక్కదిద్దుకుంటున్నారని బాబు కు ఫిర్యాదులు అందాయి.
ఈ నేపథ్యంలో ఆయన మంత్రిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో.సుబ్బారెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.







