ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నారు.తన మంత్రులని సైతం కేంద్ర పదవులకి రాజీనామాలు చేయించడంతో.
ఏపీ లో మంత్రులుగా ఉన్న బీజేపీ వాళ్ళు సైతం మంత్రి పదవులకు రాజీనామా చేసేశారు.ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఏపీ లో రాజకీయలలో భారీ మార్పులు నెలకొన్నాయి.
సామాజిక వర్గాల వారీగా.ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఏపీలో మార్పులు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి నెలకొంది…దాంతో చంద్రబాబు తన క్యాబినెట్ విస్తరణ చేయడం తప్పనిసరి అవుతోంది అయితే…ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో కేబినెట్ విస్తరణపైనే చర్చలు కొనసాగుతున్నాయి.
ఆశావాహులు కూడా ప్రయత్నాలు మొదలెట్టేశారు.
ఇదిలాఉంటే బీజేపీ వాళ్ళు రిజైన్ చేయగా ఏర్పడిన ఖాళీల భర్తీలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది…విస్తరణ జరుగనున్న నేపథ్యంలో ముస్లింలకు, ఎస్టీలకు అకాశం దక్కుతుందని భావిస్తున్నారు.
ఈ రెండు సామాజిక వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం, ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం మిగిలి ఉండటంతో చంద్రబాబు ఈ వర్గాలని ఆకట్టుకోవడానికి ఆ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని టాక్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలున్నారు.
వీరిలో జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్, చాంద్ బాషా కదిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.వీళ్లిద్దరూ జగన్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే….
ఎమ్మెల్సీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.ఎ.షరీఫ్, కర్నూలుకు చెందిన ఎన్‌ఎండీఫరూక్ ఉన్నారు.ఫరూక్‌కు శాసన మండలి ఛైర్మన్ పదవి ఇవ్వగా.
షరీఫ్ కు విప్ ఇచ్చారు.ఐతే మంత్రుల్లో కృష్ణాజిల్లా నుంచి ఖాళీ ఏర్పడటంతో తనకు పదవి గ్యారెంటీ అని జలీల్ ఖాన్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే బాబు క్యాబినెట్ లో ఇప్పటి వరకు ఎస్టీలకు అవకాశం రాలేదు.దీంతో టీడీపీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు తనకు అవకాశం వస్తుందని ఆశగా ఉన్నారు.
అయితే ముడియం కి వైసీపీ నుంచి వచ్చిన గిరిజన ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పోటీ ఇస్తున్నారు…అయితే ఇప్పటికే వైసీపీ వారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన బాబు ఈసారి మాత్రం తన పార్టీ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తారని టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక కృష్ణాజిల్లా కోటాలో మంత్రులుగా అవకాశం వస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కూడా ఆశాభావంతో ఉన్నారు.
గత విస్తరణ సమయంలో వీళ్లిద్దరూ మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు కూడా.ఈసారి మాత్రం మంత్రి పదవులు రాకపోతే కాపు సామాజిక వర్గం నేత అయిన బోండా మాత్రం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది…మరి చంద్రబాబు ఇంతమంది ఆశవాహులని ఎలా సంతృప్తి పరుస్తారో వేచి చూడాల్సిందే
.