పొరపాటున కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా...ఇలా చేస్తే ఉప్పు,కారం తగ్గి వంట రుచి పెరుగుతుంది

ఒక వ్యక్తి పుట్టిన తేది,సమయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క నక్షత్రం,రాశి చెప్పుతారు.ఆ రాశి బట్టి వారి జీవితం ఎలా ఉంటుంది….

 Best Dates To Marry Using Zodiac Signs-TeluguStop.com

అదృష్టం ఎప్పుడు వస్తుంది….వివాహం ఎప్పుడు అవుతుంది.

ఇలాంటి విషయాలను రాశిని బట్టి చెప్పుతూ ఉంటారు.అయితే 2018 వ సంవత్సరంలో ఏ రాశి వారు ఏ నెలలో ఏ రోజు పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.

1.మేష రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 27వ తేదీన వివాహం చేసుకుంటే మంచిది.

ఈ తారీఖున వివాహం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం హ్యాపీగా ఉండి కాపురంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అలాగే వీరికి అదృష్టం కూడా కలిసివస్తుంది.

2.వృషభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 7వ తేదీన వివాహం చేసే మంచి జరుగుతుంది.ఈ తారీఖున వివాహం చేసుకుంటే వారి కాపురంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు.

3.మిథున రాశి
ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఏ నెలలో అయినా 9వ తేదీన వివాహం చేసుకుంటే మంచిది.ఈ తారీఖున వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని విషయాల్లోను విజయం సాధిస్తారు.

4.కర్కాటక రాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 15వ తేదీన పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటారు.అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా హ్యాపీగా ఉంటారు.

5.సింహ రాశి
వీరు ఏ నెలలో అయినా 3వ తేదీన పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల బంధం బాగా బలంగా ఉండటమే కాకుండా ఇద్దరూ కలివిడిగా ఉంటారు.

6.కన్యారాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 11వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది.వివాహ జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తూ ప్రేమగా ఉంటారు.వీరి మధ్య ఎలాంటి వివాదాలు రావు.

7.తుల రాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 2వ తేదీన పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.భార్యాభర్తలు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా కాపురం చేస్తారు.

8.వృశ్చిక రాశి
వీరు ఏ నెలలో అయినా 18వ తేదీన పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది.భార్యాభర్తలు ఇద్దరూ ఎలాంటి కలహాలు,సమస్యలు లేకుండా కాపురం చేస్తారు.

9.ధనుస్సు రాశి
వీరు ఏ నెలలో అయినా 21వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది.భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

10.మకర రాశి
వీరు ఏ నెలలో అయినా 30వ తేదీన పెళ్లి చేసుకుంటే జీవితాంతం వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు,ఇబ్బందులు లేకుండా హాయిగా కాపురం చేస్తారు.

11.కుంభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 14వ తేదీన వివాహం చేసుకుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.అలాగే వారి మధ్య బంధం కూడా బలపడుతుంది.

12.మీనం
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 20వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరగటమే కాకుండా భార్యాభర్తలు మధ్య అన్యోన్యత బాగుటుంది.ఎటువంటి కలహాలు లేకుండా కాపురం చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube