తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కోట శ్రీనివాసరావు అంటే విలక్షణ నటుడు అంటే చెప్పాలి.ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఆయన వల్లనే సగం సక్సెస్ అయ్యాయి అని చెప్పడం లో సందేహం లేదు.
నెగెటివ్ షేడ్స్ లో తనకి మించిన నటుడు లేదు అనిపించుకున్న నటుడు.అయితే గత కొద్దికాలంగా ఆయనకీ చిత్రాలలో అవకాశాలు కల్పించడం లేదు.
పాత్రలు కరువయ్యాయి.తాజాగా సప్తగిరి సినిమాలో నటించినా అది కూడా ఎదో అలా కనిపించారు.
వయసు మీద పడుతుండటం కూడా తనకి అవకాశాలు రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు.అయితే.
ఇప్పుడు కోటా నటించక పోయినా సరే సంచలనం అయ్యారు.కోటా మాట ఇప్పుడు టాలివుడ్ లో ఎంతో మంది నటులకి చిర్రెక్కిస్తున్నాయి.
అయితే ఇప్పుడు కోటా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలగురించి అనేక కామెంట్స్ చేశాడు.
మీసం గడ్డం రానివాళ్ళు కూడ హీరోలు అయ్యిపోతున్నారు.వారికి తెలుగుమాట్లాడటం రాకపోయినా కొన్నాళ్ళు విశాఖపట్టణం వెళ్లి అక్కడ ఒకప్రముఖ వ్యక్తిదగ్గర డైలాగ్స్ నేర్చుకుని అక్కడ నుండి ముంబాయి వెళ్లి డాన్స్ లు నేర్చుకుని తాము హీరోలం అయిపోయాం అంటూ బిల్డప్ ఇస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో ఓ హీరోకి గట్టిగానే తగిలాయి.
మెగా నందమూరి కుటుంబాల నుండి వస్తున్న యంగ్ హీరోలను కూడా టార్గెట్ చేస్తూ వచ్చిన కామెంట్స్ అయితే సంచలనం గా మారాయి.”అంటే కోపం వస్తుంది కానీ ఇపుడు ఇండస్ట్రీలో పాతిక ముప్పై మంది దాకా హీరోలుగా ఉన్నారు.సొంత పేరు మీద వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతివాడు చిరంజీవి మేనల్లుడు, చిరంజీవి బావమరిది కొడుకులు, రామారావుగారి మనవడు ఇట్లా తప్ప వారి పేరు మీదవచ్చేవారు తక్కువ.నాని అనే కుర్రవాడు ఒకడు తనసొంత పేరుతో ఎదిగాడు.
ఇదివరకు అలా కాదే’ అంటూ కోట శ్రీనివాసరావు ఘాటైన కామెంట్స్ చేశాడు.
దర్శకత్వంలో సరైన అవగాహన లేని వాళ్ళు సైతం ఇప్పుడు డైరెక్టర్ అయిపోతున్నాడు.
సినిమాలు అంటే విలువలు లేకుండా పోతున్నాయి అన్నారు కోట.అంతేకాదు.అంతేకాదు ఇదేసందర్భంలో కోట కామెంట్స్ ‘బాహుబలి’ పై కూడ మళ్ళాయి.ప్రజలు ‘బాహుబలి’ గురించి మర్చిపోయి మరోకొత్త సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు…పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తున్న విషయంపై స్పందిస్తూ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.
అయితే రాజకీయాలలో సహనం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటూ పవన్ కి చురకలు అంటించారు.ఇప్పుడు ఇండస్ట్రీ లో కోటా కామెంట్స్ హాట్ టాపిక్ అనే చెప్పాలి.







