రాజకీయాలలో ఒనమాలు కూడా తెలియవు పవన్ కళ్యాణ్ కి తనకి ఉన్న బలం ,బలహీనత మాత్రం ఒక్కటే ఫ్యాన్స్.ఇదే నిజం.
అయితే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో సపోర్ట్ చేయడు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే వైసీపి అధినాయకుడు స్కెచ్ వేశాడు.పవన్ కి చెక్ పెట్టాలని ముందుగానే వ్యూహరచన చేసుకున్నాడు.
కత్తి మహేష్ వెనుక ఉన్నది వైసీపీ నేతలే అనే మాట వినిపిస్తోంది.అయితే ఈ విషయంలో అనేకమంది విశ్లేషణ ఇదే
పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫేం తగ్గించాలి,పవన్ ని ఒక్కసారిగా అందరి ముందు ఫూల్ ని చేయాలి అనేది జగన్ నిర్ణయం గా చెప్ప్తున్నారు.
కానీ ఫ్యాన్స్‌లో ముఖ్యంగా యూత్‌లో పవన్‌కున్న క్రేజ్, ఇమేజ్, ఫాలోయింగ్‌తో వైసీపీకి ఇది సాధ్యపడడం లేదు…కానీ వైసీపి గీసిన స్కెచ్ మాత్రం పర్ఫెక్ట్ గా తగిలింది పవన్ కి.పవన్‌ని చిత్ర పరిశ్రమలోని ఎవరో ఒకరితో ఢీ కొట్టించాలని ప్లాన్ వేసిందట.అలాంటి టైమ్‌లో వారికి కత్తి మహేష్ ఓ వరంలా కనిపించాడని, ఏ విషయంపైన అయినా సమర్ధవంతంగా మాట్లాడగల నేర్పు, అనర్గగళంగా మాట్లాడగల సామర్ధ్యం ఉంది కత్తికి.అందుకే ఎంతో ప్లాన్డ్‌గా కత్తిని తెరపైకి తెచ్చిందనే వాదన వినిపిస్తోంది.
అసలు కత్తి మహేష్ బిగ్ బాస్ షో లోకి ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి.తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎంతమంది కి తన గురించి తెలుగు.? తానేమి అప్పటికి ఎవరికీ తెలిసిన మొఖం కూడా కాదు అయతే ఆ అలాంటి టైమ్‌లో స్టార్ మా యాజమాన్యంతో మాట్లాడి.అందులోనూ నిమ్మగడ్డ టీమ్‌తో మాట్లాడి ఆయనకు ఎంట్రీ దొరికేలా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చూశాడట.
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పవన్‌ని కావాలనే టార్గెట్ చేసి పక్కా ప్లానింగ్‌తోనే హడావిడి మొదలుపెట్టారట.
పవన్ ఫ్యాన్స్ రెచ్చి పోవడం తో వైసీపి వాళ్ళు అనుకున్నట్టుగానే అంతా జరిగింది.
మరి జగన్ రెడ్డి బ్యాచ్ ఉందికదా రోజా లాంటి వాళ్ళు జగన్ చెప్తే పవన్ పై మాటల దాడి చేయడం పెద్ద విషయం కాదు కదా అని అనుకుంటే.ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది మరి పవన్ ని వైసీపి కనుకా డీల్ చేసి ఉంటే వైసీపికి కాపులు దూరం అయిపోతారు.
అప్పుడు మొదటికే మోసం వస్తుంది.సో వైసీపీ కత్తి మహేష్ రూపంలో తమ లక్ పరీక్షించుకుందట.
దీనికి రెస్పాన్స్ బాగా వచ్చిందని.ఇలా, తొలిసారిగా పవన్‌పై జగన్ ఆధిపత్యం సాధించాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరి మాములుగానే పవన్ కి తిక్క ఎక్కువ కత్తి విషయంలో వైసీపి పాత్రపై పవన్ కి ఒక క్లారిటీ వస్తే జగన్ పై ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.మొత్తానికి కత్తి విషయంలో పవన్ కి వైసీపి భారీ షాక్ ఇచ్చింది అనే మాట వాస్తవం.







