మొన్నటికి మొన్న తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రపంచ మహా సభలని ఎంత ఘనంగా నిర్వహించాడో వేరే చెప్పవలసిన అవసరం లేదు.ఎంతో మందికి ఆ సభలో సన్మాన సత్కారాలు చేశారు.
వచ్చిన ప్రతీ ఒక్కరు ఆహా ఓహో అంటూ కేసీఆర్ ని పొగడ్తలతో ముంచేశారు.టాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా ఈ కార్యక్రమానికి తరలి వెళ్ళారు కూడా.
సినీ పెద్దలు ఎప్పుడు అంతమంది ఒక కార్యక్రమానికి వెళ్లి ఉండరు అనుకుంట.కేసీఆర్ కి భయపడి వెళ్ళారా లేక మాములుగానే వెళ్ళారా అనేది తరువాతి విషయం.
అయితే సినీ పరిశ్రమలో 85 శాతం మంది ఏపీ వారే అనేది అందరికీ తెలిసిందే అయినా.కేసీఆర్ మీద ఉన్న భయం తోనో ముందు ముందు ఎలాంటి అవసరం వస్తుందో అనే విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకునో వెళ్ళారు కేసీఆర్ మీరు మహానుభావుడు అంటూ పొగిడేశారు.
ఆ పొగడ్తల వెనుక మర్మం తరువాతా విషయం అయితే సినీ పరిశ్రమ అంతా అక్కడ ఉండిపోవడం వల్లనే కదా మనవారు అందరు అక్కడ అనిగిమనిగి ఉండాల్సి వస్తోంది అంటూ అభిప్రయపడుతున్నారు అనేకమంది.అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి ముందు ముందు ఉండదు అంటున్నారు.
ఎలా అంటే తెలుగు సినీ పరిశ్రమని అమరావతి వైపు ఆకర్షించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అమరావతిలో సినిమా పరిశ్రమ నెలకొల్పడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందట.
నిర్మాతలను ఆకర్షించడానికి తక్కువ ధరకే భూములు ఇవ్వాలని భావిస్తోందట.సిని నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని కూడా భరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు సూచనల మేరకు రాజధాని ప్రాధికార సంస్థ సీఆర్ డీఏ ఈ ప్రతిపాదనలను తయారు చేస్తోందట.
మీడియా సిటీని అమరావతిలో నిర్మించడానికి ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలని రూపొందించింది అంటున్నారు.
దాదాపు 5 వేలకు పైగా ఎకరాల్లో ఈ మీడియా సిటీ రాబోతోంది.ఇందులో స్టూడియో పెట్టేందుకు రెడీగా ఉన్నవారికి ఎకరం ఏభై లక్షల రూపాయలకే ఇస్తారట.అంతే కాదు.ఇకపై ఏటా చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తారట.2021 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చలనచిత్రోత్సవం కూడా జరుపుతారట…అయితే మరిన్ని మార్గదర్సకాలు ప్రభుత్వం ఇచ్చిన తరువాత ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం అంటూ బడా నిర్మాతలు ముందుకు వస్తున్నారట మరి సొంత రాష్ట్రంలో ఇన్ని అవకాశాలని ప్రభుత్వం కలిపిస్తుంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి మరి.అయితే కేసీఆర్ చేసిన పనికి బాబు బాగానే రెప్లై ఇచ్చాడు అని తెగ సంబరపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.







