ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ తన దూకుడు పెంచుతూ.సమస్యల పరిష్కారమే జనసేన అజెండాగా దీసుకు వెళ్తోంది.
అయితే ఇప్పుడు ఇదే రీతిలో తెలంగాణలో కూడా జనసేన తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.త్వరలోనే తెలంగాణా ప్రజల సమస్యల పరిష్కారానికి నేను ఉన్నాను అంటూ.
మీకోసం నేను ప్రస్నిస్తాను అంటూ తెలంగాణా రాజకీయాల్లోకి వెళ్ళడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది.అయితే తెలంగాణలో జనసేనకి పట్టు లేదు.
అక్కడ ప్రశ్నించడానికి చాలా మంది ఉన్నారు ఇక మీరు ప్రశ్నించడానికి ఇక్కడ ఏమి మిగలలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే మరి పవన్ ఎందుకు తెలంగాణా మీద ఒక్కసారిగా దృష్టి పెట్టారు అంటే.
ఈ ప్రశ్న చాలా మంది మెదళ్ళు తొలిచేస్తోంది.ఏపీలోనే సరిగ్గా ఏమి ప్రశ్నించని పవన్.టిడిపికి వంత పాడుతున్న పవన్.ఇక తెలంగాణ ప్రజల మీద ఉన్నట్టుండి ఎందుకు అంత ప్రేమ వొలకబోస్తున్నారు అంటే.
ఎపీలోనే ప్రశ్నిస్తారా.మీరు తెలంగాణాలో ఉంటున్నారు.
తెలంగాణాలో కూడా పోటీ చేస్తాను అన్నారు మరి ఇక్కడ సమస్యల మీద మీరు ఎందుకు స్పందించటం లేదు అని ఈ మధ్య పొలిటికల్ సెటైర్స్ ఎక్కువ అవుతున్నాయి.దాంతో ఆలోచనలో పడ్డ పవన్ చంద్రబాబు సూచనతోనే తెలంగాణలో తన వాయిస్ వినిపించానున్నారు అని టాక్.
ఒక్క ఏపీ రాష్ట్రంలోనే పవన్ టార్గెట్ చేస్తూ వెళ్తుంటే ఏపీలో ప్రజలకి ఇలాంటి సందేహాలు వస్తున్నాయి.పవన్ బాబు లాలూచీ నిజమే అన్నట్టుగా ప్రజలకి ఒక సూచన వెళ్తుంది.
అది ప్రమాదం అని భావించిన బాబు పవన్ కి ఈ ఐడియా ఇచ్చారట.అయితే ఎలాగు తెలంగాణలో పోటీ చేస్తాను అంటున్నాడు అక్కడ కూడా ఆ విషయంలో కూడా ప్లస్ అవుతుంది అని భావిస్తున్నారు.
అందులో భాగంగానే…తెలంగాణాలో పర్యటించి రాజకీయ కాక పెంచాలని చూస్తున్నాడు.ఇప్పటికే తెలంగాణ జనసేన పార్టీకి బీసీ వర్గానికి చెందిన నేమూరి శంకర్ గౌడ్‌ను పవన్ అధ్యక్షుడిగా నియమించారు.
శంకర్ గౌడ్ యువరాజ్యంలో పవన్ టీంలో యాక్టివ్ గా పనిచేశారు.యువ రాజ్యంలో కీలకంగా వ్యవహరించిన మరో నాయకుడు మెదక్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డిని జాతీయ ఉపాధక్షుడిగా నియమించారు.
ఇప్పుడు వీరు ఇద్దరూ తెలంగాణ జనసేనకు నాయకులుగా ఉన్నారు…అందుకే ముందుగా తెలంగాణాలో ప్రజా సమస్యలను గుర్తించే పనిలో ఆ పార్టీ నిమగ్నమయ్యింది.
అందులో భాగంగానే ఆంధ్రతో పాటు తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజక వర్గాలకు సమన్వయకర్తలను నియమించారు.
జనసేన లో విద్యార్థి విభాగం.యువజన విద్యార్ధి విభాగం.
యువజన విభాగం మహిళా వింగ్‌ల నియామకాలు పూర్తయినట్లు తెలుస్తోంది.త్వరలో వీటిని అధికారికంగా ప్రకటిస్తారనితెలుస్తోంది.
లోక్ సత్తా పార్టీ క్యాడర్ కూడా జనసేనలో చేరటానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.గ్రేటర్ హైద్రాబాద్, ఖమ్మం,ఉమ్మడి నిజమాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
మరి కేసీఆర్ తెలంగాణలో పవన్ ని ఎలా ఎదుర్కొంటారు.ముందు ముందు తెలంగాణా రాజకీయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.







