ప్రస్తుతం ఏపీలో టిడిపికి బీపి ని పెంచుతున్న అంశం పోలవరం.ఒక్క లెటర్ రాసేసి బిజెపి అధిష్టానం మిన్నకుండి పోయింది…టిడిపి సర్కారుకు ఇప్పుడు ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి.
పోలవరం మీద పొలిటికల్ గా లాభాపడచ్చు అనుకున్న టిడిపి ఆశలకి…మధ్యలో బ్రేక్ పడినట్టే.టిడిపికి చెక్ పెట్టాలని చుసిన బిజెపి ఎత్తుగడలకి చంద్రబాబు చెక్ పెట్టకుండానే ఉంటారా అందుకే బాబు కూడా ఒక భారే స్కెచ్ రెడీ చేసుకుని ఉంచాడు.
ఈ ప్లాన్ తో బిజెపి సీన్ రివర్స్ అవ్వడం ఖాయం అంటున్నారు.టిడిపి నాయకులు
కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాసరే.
పోలవరం పనులని మాత్రం చంద్రబాబు ఆగనివ్వడం లేదు ఎందుకంటే.పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అని చంద్రబాబు కి బాగా తెలుసు.
అయితే తాజాగా బాబు చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఇష్టంలేదన్నట్టుగానే తెలుస్తోంది.ఒక వేళ పోలవరం ఆగితే దానిపై తప్పు తమది కాదు అని చెప్పిందుకు.
ఈ విషయంలో బిజెపిని బూచిగా చూపించేందుకు టిడిపి ఇప్పటికే ఎదురు దాడి మొదలు పెట్టేసింది.అందుకే ప్రత్యెక హోదా.
అమరావతి.రైల్వే జోన్.
ఇలా చాల విషయాలలో ఏపీ బిజెపి చేసిన అన్యాయంపై ప్రజలకి అర్థం అయ్యేలా మాటలు మాట్లాడటం చేస్తున్నారు
ఏపీలో చంద్రబాబు అండతోనే బిజెపి ఎదుగుతున్న క్రమం మునుపటి ఎన్నికల్లోనే తెలిసింది.అయితే మేము చెప్తే చంద్రబాబు వినేలా ఉండాలి అనుకున్న బిజెపి ఆదిసగా బాబు పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది .ఇది గ్రహించిన బాబు ఇప్పుడు బిజెపిని ఇరుకున పెట్టె పనిలో పడ్డారు.వారు చేస్తున్న నాటకాలకి దీటుగా ఎప్పటికప్పుడు సంధానం చెప్తూ వస్తున్నారు.
అయితే మరొక సారి మోడీ దగ్గర పోలవరం పంచాయితీ పెట్టి తేల్చుకుందాం లేకపోతే బిజెపిని ప్రజలలో ఎలా డమ్మీ చేయచ్చో ఆలోచిద్దాం అనే లెక్కకు వచ్చేశారు
ఈ క్రమంలోనే.పోలవరంపై అనుకూల ప్రకటన రాకపోతే.
టిడిపి తరుపున మంత్రులుగా ఉన్న అశోక్ గజపతి రాజు.సుజనా చౌదరీలతో రాజీనామాలు చేయించేందుకు కూడా సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది…కేంద్ర మంత్రులుగా ఉన్న వీరు ఇరువురు రాజీనామాలు చేసి…రాష్ట్ర పరభుత్వంలో ఉన్న బిజెపి మంత్రులతో రాజీనామాలు చేయించకుండా ఉంటే.
అప్పుడు మోడీ ఏపీ ప్రజల ముందు విలన్ గా కనిపిస్తారు అనేది బాబు ప్లాన్.మరి మోడీ ఆ సమయంలో అయినా సరే మారుతారేమో అనేది టిడిపి అభిప్రాయం ఒక వేళ మోడీ ఏ విధంగా అయినా సరే లొంగక పొతే…అనుసరించాల్సిన వ్యుహాలని ప్లాన్ చేసుకుంటోంది టిడిపి.
మొత్తానికి బాబు మోడీ తో డీ అంటే డీ అంటున్నారు మరి మోడీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.







