ఉద‌యాన్నే ఒక గ్లాస్ వాము నీటిని తాగితే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులను చూసి ఆశ్చర్యపోతారు

కొంచెం ఘాటుగా, కారంగా, వ‌గ‌రుగా ఉండే వామును వంటల్లో వాడుతూ ఉంటాం.వాము వంటల్లో వేయటం వలన మంచి రుచి వస్తుంది.

 Ajwain Health Benefits In Telugu-TeluguStop.com

అంతేకాక వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయం వాము నీటిని తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుస్కుందాం.

మొదట వాము నీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.రెండు టీ స్పూన్ల వాముని దోరగా వేయించి, దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి.

ఉద‌యాన్నే వామును అలాగే అదే నీటిలో మ‌రిగించాలి.అనంత‌రం వామును వ‌డ‌గ‌ట్ట‌గా వ‌చ్చే నీటిని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే త్రాగాలి

వాము నీటిలో వెనిగ‌ర్ లేదా తేనె కలిపి తీసుకుంటే కిడ్నీలు, మూత్రాశ‌యంలో ఉండే రాళ్లు కరిగిపోతాయి

మధుమేహం ఉన్నవారు ఈ నీటిని త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది


అధిక బరువు ఉన్నవారు త్రాగితే చాలా తొందరగా బరువు తగ్గుతారు

కీళ్లనొప్పులు,వాపులు తగ్గటమే కాకుండా శరీరం తేలికగా ఉంటుంది

సాధారణంగా గ‌ర్భిణీల్లో వచ్చే మ‌ల‌బ‌ద్ద‌కం, కడుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు తొలగిపోతాయి.బాలింత‌ల్లో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి

ఊపిరితిత్తుల్లో చేరిన క‌ఫం తొలగిపోయి ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి

మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్‌, అసిడిటీ సమస్యలు రావు.దాంతో మలబద్దకం సమస్య కూడా దరికి చేరదు

ఈ కాలంలో వచ్చే ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube