జనసేన పూర్తీ స్థాయిలో కసరత్తు మొదలుపెట్టేసింది.ఎన్నికల్లో దిగి తమ సత్తా ఏంటో చూపించడానికి సిద్దం అంటున్నారు జనసేన నాయకులు.
పోటీ చేసేది తక్కువ స్థానాలే అయినా.ఎక్కువ అయినా సరే మేము చేసే ప్రయత్నం మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుంది.
జనసేన ఒక కొత్త ఫన్దాలో ముందుకు వెళుతుంది అని చెప్తున్నారు ఆ పార్టీ నాయకులు.గత ఎన్నికల్లోనే పార్టీ స్థాపించినా.
పోటీకి దూరంగా ఉండి.టిడిపి.
బిజేపి లకి సపోర్ట్ చేసింది.ఇప్పుడు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాను అంటోంది
ఎన్ని స్థానాల్లో జనసేన పోరు ఉంటుంది.
ఎలా చేస్తారు.పొత్తు ఉంటుందా లేదా.
ఇలాంటి వాటిమీద క్లారిటీ లేకపోయినా సరే ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రకటన చేసి జనసేన కార్యకర్తలని.పవన్ అభిమానులని అలెర్ట్ చేస్తూ ఉంటారు.
పార్టీ ఆఫీసులని ఓపెన్ చేస్తూ ఒక సారి.పార్లమెంటరీ స్థాయిలో మెంబెర్స్ ని నియమిస్తున్నాం అంటూ మరొకసారి.
ఇలా మెల్ల మెల్లగా తమ కార్యక్రమాలని మీడియాకి సైతం ముందుగానే తెలియనివ్వకుండా చేస్తూ ఒక పక్క ప్లాన్ గా వెళ్తున్నారు
ఐతే మొన్నటికి మొన్న జనసేన ఉపాద్యక్షుడు మహేందర్‌రెడ్డి కాకినాడలో మాట్లాడుతూ పార్లమెంటరీ స్థాయిలో ఏపీ, తెలంగాణల్లోని 42 లోక్‌సభ స్థానాల పరిధిలో 848 మందిని ఎంపిక చేశామని, డిసెంబరుకు వీరికి శిక్షణ పూర్తవుతుందని తెలిపారు.అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను రెండు విడతలుగా ఏర్పాట్లు చేస్తున్నటుగా తెలిపారు.
ఈ వార్తతో కార్యకర్తలలో జోష్ పెరిగింది.అయితే నిన్న రాజమండ్రి ఆనంరోటరీహాల్‌లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ వేదిక మీద మహేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాన్ని ఆయన ప్రకటించారు.జనసేనాని అనంతపురం నుంచీ పోటీ చేస్తారని ప్రకటించారు.
డిసెంబర్ మొదటివారం నుంచీ పూర్తీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలకి సమయం కేటాయిస్తారు అని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణా,ఏపీ రెండు రాష్ట్రాలలో ఉన్న అన్ని స్థానాలలో.
జనసేన అభ్యర్ధులు నిలబడుతారు అని తెలిపారు.తొందరలోనే ప్రతీ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసి ప్రకటిస్తాం.
ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఈ సందర్భంగా చెప్పారు.తమ పార్టీలో పవన్‌కళ్యాణ్ నిర్ణయం తుది నిర్ణయం అని అందరం పవన్ కళ్యాణ్ గారి మాటమీద నిలబడుతాం అని తెలిపారు.







