రాజకీయం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఎంత కాకలు తిరిగిన మొనగాడైనా సరే ఎదో ఒక సమయంలో దెబ్బతింటాడు ఐతే దెబ్బతిన్నప్పుడు ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళేవారు మాత్రమే రాజకీయాల్లో రాణించారు.ఇది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కలేదు.
చరిత్ర చెప్పే నిజం.ప్రధానమంత్రి మోడీ కూడా ఇలాంటి షాకులు అప్పుడప్పుడు తింటూనే ఉంటారు.
మరి తెలంగాణలో బిజెపి మాత్రం రోజుకో షాక్ తింటూనే ఉంటుంది.అయినా ఒక బలమైన వాయిస్ ఉన్న నాయకుడిని తయారుచేసుకోలేకపోవడం బిజెపి తప్పిదం
తెలంగాణా బిజేపిలో నెల రోజుల కిందట ఉన్న హవా ఇప్పుడు కనిపించడం లేదు.ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంటుందని భావించిన నేతలు ఇప్పుడు ఆ ఊసు కూడా లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని అసలు పెట్టుకున్న బిజెపి ఆదిసగా పక్కా స్కెచ్ వేస్తూ ముందుకు వెళుతోంది.అయితే తమవైపు వస్తారని ఆశించిన రేవంత్ రెడ్డి మరియు మిగిలిన నేతలు కట్టకట్టుకుని కాంగ్రెస్‌లో కలిసిపోయారు ఒక్కసారిగా ఈ పరిణామంతో బీజేపీ షాక్ కి గురయ్యింది.అసలెందుకిలా జరిగిందని ఢిల్లీలోని పెద్దలు సైతం నివ్వెర పోయారు.
ఇదే సమయంలో అమిత్ షా బిజెపి నాయకులకి చీవాట్లు పెట్టడం ఎలా అయినా రేవంత్ ని బిజెపిలోకి తీసుకురావాలని చెప్పింది
మావల్ల కాదు అని తెలంగాణా బిజెపి చేతులు ఎత్తేయడంతో.అమిత్ షా చంద్రబాబుని అడిగారు.
ఇప్పుడు నేను చేసిది ఏమిలేదు అని బాబు అమిత్ షా కి వివరించారు.అయితే ఇకనైనా ఆకర్ష్ వేగం పెంచాలంటూ అమిత్ షా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించినట్టు టాక్.
అది కూడా ఈ నెల నుంచే పని మొదలుపెట్టి, వచ్చే నెలల్లో ఒకేసారి పెద్ద ఎత్తున భాజపాలో చేరికలు ఉండేలా రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టాలంటూ జాతీయ నేతలు ఉద్బోధించినట్టు తెలుస్తోంది.జిల్లా స్థాయిలో పార్టీలోకి చేరికలు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, దీంతోపాటు వచ్చే నెలలో కనీసం ఇద్దురు లేదా ముగ్గురైనా పేరున్న నాయకుల్ని పార్టీలోకి తీసుకు రావాలని కూడా హుకుం జారీ చేసినట్టు సమాచారం.అమిత్ షా పర్యటన జరిగేలోపు కనీసం ఐదు నుంచీ పది మంది అయినా సరే ఆ సమయంలో బిజెపిలో చేరాలని.గట్టిగానే రాష్ట్ర బిజెపికి చెప్పారట.పాపం ఒక పక్క రేవంత్ ఎఫెక్ట్ తో డైలమాలో పడ్డ తెలంగాణా బిజెపి ఇప్పుడు వలసలు అంటే ఎక్కడి నుంచీ తేవాలో అర్థం కాక అయోమయంలో పడ్డారని తెలుస్తోంది.







