ఈనాడు తెలుగుదేశం ఆస్థాన పత్రిక.తెలుగుదేశం అంటే ఈనాడు.
ఈనాడు అంటే తెలుగుదేశం అనే చందంగా ఉండేది ఇద్దరిమధ్య అనుభందం.ఒకరంగా చెప్పాలి అంటే రాజకీయంగా చంద్రబాబు ఎంతో నిలదొక్కుకున్నారు అంటే దానికి కారణం ఈనాడు అనే విషయం అందరికీ తెలిసినదే.
ఈనాడులో రాసే కధనాలు బాబు పొలిటికల్ మైలేజ్ ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళాయి.రాజకీయంగా ఎంతో ఎదుగుదలకి కారణం అయ్యింది చంద్రబాబుకి.
ఇక వైఎస్స్ఆర్ పత్రిక సాక్షి.జగన్ తన తండ్రికోసం స్థాపించిన ఈ పత్రిక తెలుగుదేశం ఎదుగుదలకి ఎంత ప్రయత్నించాలో అంతగా ప్రయత్నిస్తూనే ఉంది.
చంద్రబాబు ఒకటి అంటే మరొకటి మార్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండేది
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం.అధికార పక్షం ఎలాగా ఉన్నాయో.
పత్రికల్లో కూడా ప్రధాన పత్రిక.ప్రతిపక్ష పత్రిక కూడా అలానే ఉన్నాయి ఒకటి ఈనాడు మరొకటి సాక్షి.
ఇప్పుడు ఈ రెండు ఏకం అయ్యాయి అని టాక్.ఎవరో చెప్తే అది గాసిప్ అయ్యేది మరి సాక్షాతూ ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు అంటే ఈ విషయం నిజం కాదు అని ఎవరు మాత్రం చెప్పగలరు
ఆశ్చర్యంగా అనిపించినా ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈనాడుపై ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం.
గత కొన్నాళ్లుగా ఈనాడు పంథా మార్చుకుందని, ఏపీ విషయంలో ముఖ్యంగా.తన(చంద్రబాబు) విషయంలోనూ ఈనాడు రాస్తున్న కథనాలు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాయని బాబు ఆందోళన వ్యక్తం చేశారట
దీనికి కారణం.
ఈనాడు రాసిన ఒకే ఒక్క కథనం.ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటికి తెచ్చిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారట.
ఈనాడులో ప్రచురితమైన.‘శతమానం భారతీ- తెలంగాణ ప్రగతి’ అనే శీర్షికతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ ఈనాడు ప్రత్యేకంగా ప్రచురించింది.
అదే సమయంలో ఏపీకి 15వస్థానం దక్కిందని కూడా రాశారు.దీంతో బాబు ఈ కథనంపై మండిపడ్డారు.
సర్వేలు పూర్తీ కాకుండానే ఇలాంటి కధనాలు చేస్తే రాష్ట్ర భవిష్యత్తు.పెట్టుబడులు పెట్టాలని వచ్చే కంపెనీలకి అభద్రతా భావం పెరిగిపోతుంది అని ఆయన ప్రశ్నించారు.
సాధరణంగా రామోజీ అప్పాయింట్‌మెంట్ ఎవ్వరికీ ఇవ్వరు.అలాంటిది జగన్ అడగగానే వెంటనే ఒప్పేసుకుని కూర్చోపెట్టి మాట్లాడటం కూడా చంద్రబాబుకి నచ్చలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాబు.రామోజీకి ప్రాధాన్యం తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం.
మరి ఏం జరుగుతుందో చూడాలి.ఇప్పుడు చంద్రబాబు ఈనాడు మీద చేసిన కామెంట్స్ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.