టీఆర్ఎస్ వ్యూహం..రేవంత్ బ్యాచ్ తిరిగి టిడిపిలోకి

రేవంత్ టిడిపిని విడిచి వెళ్ళేటప్పుడు తానూ ఒక్కడే కాకుండా మిగిలినా టిడిపి నాయకులని.కార్యకర్తలని కాంగ్రెస్ లోకి తీసుకు వెళ్ళాడు.

ముఖ్యంగా తన కొడంగల్ నుంచీ కూడా నాయకులని కాంగ్రెస్ లోకి జంప్ చేయించాడు.అదేసయంలో కేసీఆర్ కూడా కొడంగల్ లోని కొందరు ముఖ్య టిడిపి నాయకులని టీఆర్ఎస్ కండువా కప్పుకునేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు.

అయితే ఇదంతా పెద్ద కిక్కు లేదనుకున్న కేసీఆర్ ఇప్పుడు మరింత మంది నాయకులూ తెరాసా లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.అది కూడా టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి వెళ్ళిన నాయకులే.

టిడిపి పై అప్పుడప్పుడు విమర్శలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నా అవి పై పై కి మాత్రమే అని వచ్చే ఎన్నికల్లో పొత్తుల దృష్ట్యా వీరుఇద్దరు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.అందుకే కేసీఆర్ రేవంత్ ని అణగదొక్కడానికి భారీ స్కెచ్ వేస్తున్నారు అని తెలుస్తోంది.

Advertisement

ఇప్పుడు వెళ్ళే వాళ్ళని ఆపడం పెద్ద విషయమేమీ కాదు కానీ రేవంత్ తో ఇంతకుముందే వెళ్ళిన నేతలని తిరిగి మళ్ళీ టిడిపిలోకి వచ్చే విధంగా పావులు కదిపారు కేసీఆర్.ఇప్పుడు రేవంత్ వెంట వెళ్ళిన టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా తిరిగి మళ్ళీ టిడిపిలోకి వస్తున్నారు.

రేవంత్‌ వెంట ఢిల్లీ కూడా వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యుడు వేణుయాదవ్‌ గురువారం చంద్రబాబు సమావేశంలో పాల్గొన్నారు.టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడిగాపనిచేసిన చిలుక మధుసూదన్‌రెడ్డి కూడా ఎన్టీఆర్‌భవన్‌కు వచ్చి తిరిగిపార్టీలో చేరేందుకు ప్రయత్నించారు.

పార్టీని విడిచివెళ్లి పొరపాటు చేశానని మధు చెప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి సమావేశంలోనే ప్రకటించారు.టిడిపిని వదిలి కాంగ్రెస్ లోకి రేవంత్ వెంట వెళ్ళిన నాయకులకి కేసీఆర్ చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

అందుకే మళ్ళీ టిడిపిలో జంప్ అవుతున్నారని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టిడిపి పొత్తులో ప్రభుత్వం రాగానే వారికి సముచిత స్థానం కలిపిస్తామని మాట ఇచ్చినట్ట్టు టాక్.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు