నల్లగా ఉన్న మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మారాలంటే సమర్ధవంతమైన చిట్కా ఉంది.ఎండలో ఎక్కువగా తిరగటం,కాలుష్యం మరియు కొన్ని రకాల క్రీమ్స్ కారణంగా ముఖం నల్లగా మారితే దిగులు చెందవలసిన అవసరం లేదు.
ఇప్పుడు మేము చెప్పే ఈ చిట్కాతో రెండే రెండు నిమిషాల్లో మీ ముఖం తెల్లగా మారిపోతుంది.కేవలం రెండే రెండు వస్తువులు ఉంటె సరిపోతుంది.
అవి తేనే , కాఫీ పొడి.
తేనెలో మాంగనీస్,కాలిష్యం ,ఇనుము,రాగి,మెగ్నీషియం,జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి అనేక ఖనిజ లవణాలు ఉంటాయి.
రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, నికోటెనిక్ యాసిడ్,పాంటోథెనిక్ యాసిడ్,థైమీన్ వంటి విటమిన్స్ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ, అమైనోఆమ్లాలూ ,ఎంజైములూ ఉంటాయి.ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ముఖం మీద పేరుకుపోయిన తాన్ ని తొలగించటంలో చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఇక కాఫీ పొడి విషయానికి వస్తే కాఫీ పొడి ముఖం మీద రంద్రాలను తగ్గించటంలో చాల ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే ముఖం మీద పేరుకుపోయిన తాన్ ని తొలగించటంలో చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఒక బౌల్ లో కాఫీ పొడి తీసుకోని దానిలో తేనే వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా రబ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజుకి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.