క్యారెట్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ లను సూప్స్, సలాడ్లు మరియు జ్యూస్ లలో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు.క్యారెట్ చర్మం, కళ్ళు, జీర్ణ వ్యవస్థ మరియు మొత్తం శరీర ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

కాబట్టి ఇప్పుడు క్యారెట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1.బీటా కెరోటిన్:

క్యారెట్ లో శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన అనేక ముఖ్యమైన ఉపయోగాలతో పాటు, శరీరంలో విటమిన్ A ని బీటా కెరోటిన్ గా మార్చి ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

2.జీర్ణక్రియ:

క్యారట్ లాలాజలం పెంచడానికి మరియు జీర్ణక్రియకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్ లను సరఫరా చేస్తుంది.క్యారెట్లను క్రమం తప్పకుండా తింటే గ్యాస్ట్రిక్ అల్సర్ మరియు ఇతర జీర్ణ లోపాలను నిరోధించడానికి సహాయపడుతుంది.

3.ఆల్కలీన్ అంశాలు:

క్యారట్ లో ఆల్కలీన్ అంశాలు పుష్కలంగా ఉండుట వలన, శరీరంలో ఆమ్ల / క్షార నిష్పత్తిని సంతులనం చేసి రక్తాన్ని శుద్ధి మరియు పునరుద్ధరించటానికి సహాయపడుతుంది.

4.పొటాషియం:

క్యారట్ లో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను ఆరోగ్యకరంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.తద్వారా కృత్రిమ రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి.

5.దంతాల ఆరోగ్యం:

క్యారట్ నోటిలో హానికరమైన క్రిములను చంపడానికి మరియు దంత క్షయాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.

తాజా వార్తలు