హైదరాబాద్‌లో ఎప్పుడూ డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు అయినా ముందుగా టాలీవుడ్ పేరు బయటకు వస్తోంది.టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు చాలా పెద్ద పెద్ద లింకులే ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాను విచారిస్తుంటే వారికి టాలీవుడ్ ప్రముఖులకు చాలా కీలక సంబంధాలు ఉన్నట్టు వెల్లడైంది.
ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు యంగ్ హీరోలు.ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లు, ఒక కొరియోగ్రాఫర్, ఒక స్టంట్ మాస్టర్ ఉన్నట్టు తెలుస్తోంది.
వీరు వచ్చే ఆరు రోజుల్లో ఎప్పుడైనా విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పట్టుబడ్డ వారి పేర్లు రాసేందుకు ఏ మీడియా సాహసించడం లేదు.అయితే టాలీవుడ్ ఇంటర్నల్ చర్చల్లో మాత్రం వారి గురించి చర్చలు నడుస్తున్నాయి.
– బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సినిమా రంగం నచ్చావులే అంటూ ఒకటి రెండు హిట్లు కొట్టి ఇప్పుడు వరుస ప్లాపులతో డీలా పడ్డ హీరో డ్రగ్స్‌కు బాగా బానిస అయ్యాడట.
– సినిమా ఫంక్షన్లలో హీరోలను ఆకాశానికి ఎత్తేయడంలో ముందుంటే ఓ బడా నిర్మాత కూడా ఇందులో ఉన్నాడట.సదరు నిర్మాత ఓ మాజీ మంత్రికి బినామి అన్న టాక్ ఉండనే ఉంది.
– అమెరికా నుంచి వచ్చి కొన్ని హిట్ చిత్రాల్లో నటించి ఇప్పుడు అడపా దడపా సినిమాల్లో నటిస్తోన్న మరో హీరో వీటికి బాగా బానిసగా మారాడట.
– సినిమాలు స్పీడ్‌గా తీస్తాడని పేరున్న ఓ టాప్ డైరెక్టర్.ఇండస్ట్రీలో టాప్ హీరోలందరికి హిట్లు ఇచ్చాడు.అయితే ఇప్పుడు వరుస ప్లాపులతో ఆయన పేరు పూరీలో చప్పబడింది.సదరు టాప్ డైరెక్టర్ వీటికి బాగా ఎడిక్ట్ అయ్యాడట.
– అటు వెండితెరపై, ఇటు టీవీ తెరపై రాణిస్తూ హాట్ హాట్ షోలతో అలరించే ఓ నటికి సైతం నోటీసులు అందాయట.
– ఓ డైరెక్టర్‌తో సహజీవనం చేస్తోందన్న పేరున్న ముదురు హీరోయిన్ అయిన… ఓ చార్మీంగ్ హీరోయిన్ కూడా వీటికి సదరు డైరెక్టర్ ద్వారా అలవాటు పడిందట.
– ఇక టాప్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న మరో హీరోయిన్ సైతం వీటికి అలవాటు పడినట్టు టాక్.
ఈ లిస్టులో వీరి పేర్లే బయటకు వచ్చినా…ఎవ్వరికి తెలియకుండా ఈ దందా చేస్తోన్న వాళ్లు, వీటికి అలవాటుపడిన జాబితా చాలానే ఉందని టాలీవుడ్ వర్గాలే చెపుతున్నాయి.