అలా ఎలా మాట్లాడతాడు ... రాజమౌళిపై శ్రీదేవి ఆగ్రహం

బాహుబలి సీరీస్ లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఎలాంటి గుర్తింపుని సాధించిందో మనందరం చూసాం.

ఈ కథలో అమరేంద్ర బాహుబలి ఇష్టమా లేక శివగామి ఇష్టమా అని అడిగితే కాసేపు ఆలోచించెంత ఎత్తులో కూర్చోబెట్టారు ఆ పాత్రని రమ్యకృష్ణ.

ఆ పాత్రకి వచ్చిన గుర్తింపు వలనే "ది రైజ్ ఆఫ్ శివగామి" అంటూ శివగామి చిన్నతనం నుంచి మాహిష్మతి సామ్రాజ్యానికి రాజమాత అయ్యేంతవరకు, ఆమే తన జీవితంలో చేసిన సాహసాల గురించి ఏకంగా ఓ పుస్తకమే వచ్చింది.మరో రెండు పుస్తకాలు రానున్నాయి.

మరి ఇలాంటి శివగామి పాత్రను చేతులారా వదిలేసుకున్నారు అతిలోకసుందరి శ్రీదేవి.ఆవిడ 8 కోట్ల రేమ్యునరేషన్ అడిగారని, అంతే కాకుండా, ప్రతి ప్రయాణానికి 5 బిజినెస్ క్లాస్ టికెట్లు, హైదరబాద్ లోని అతిపెద్ద హోటల్ లో అయిదుగురికి వసతి, దానికి మించి హిందీ లాభాల్లో వాటా అడిగేసరికి, మరి టూ మచ్ అనుకోని శ్రీదేవిని వదిలేసామని రాజమౌళి రెండు మూడు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే.

దీనిపై శ్రీదేవి రెండు మూడు కార్యక్రమాల్లో అడిగినా స్పందించలేదు.కాని ఇంకెన్ని రోజులు ఈ మౌనం, రాజమౌళి మీద కౌంటర్ ఎటాక్ చేయాల్సిందే అనుకుందేమో, తన తదుపరి చిత్రం "MOM" కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవి మీడియా సమావేశంలో రాజమౌళి మీద విమర్శలు చేయనే చేసారు.

Advertisement

"ఒక ఆర్టిస్టు రెమ్యునరేషన్ ఏంతో పబ్లిక్ గా బయటపెట్టే అధికారం ఏ దర్శకుడికి లేదు.నాకున్న కారణాలతో నేను గతంలో ఎన్నో హిట్ సినిమాలను వదిలేసుకున్నాను.

ఏ దర్శకుడు కూడా ఇలా మాట్లాడలేదు.ఓ సినిమాను ఒప్పుకునే హక్కు కాని, కాదనే హక్కు కాని నాకు లేదా? నేను మరి ఓవర్ డిమాండ్ చేసేదాన్నే అయితే కెరీర్ లో 300 సినిమాలు చేయగలిగేదాన్ని కాదు" అంటూ సమాధానమిచ్చారు శ్రీదేవి.మరి ఈ టాపిక్ ఇక్కడితో ఖతం అయిపోతుందో లేక జక్కన్న లాస్ట్ పంచ్ ఇవ్వాలని ఓ ఫినిషింగ్ టచ్ ఇస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు