ప్రభాస్ ని క్లీన్ షేవ్ తో ఎప్పుడు చూసింది లేదు.ఈశ్వర్ నుంచి బాహుబలి 2 వరకు, ప్రతి సినిమాలో అయితే మీసం, గడ్డం రెండిటితో కనిపించాడు లేదంటే కేవలం మీసంకట్టుతో కనిపించాడు.
కాని ఒక్క సినిమాలో కూడా క్లీన్ షేవ్ లుక్ వాడలేదు.కాని సడెన్ గా నిన్న ప్రభాస్ గడ్డం, మీసం లేకుండా ఉన్న ఫోటో ఒకటి నెట్ లో ప్రత్యక్షమైంది.
మొదటిసారి చూడగానే ప్రభాస్ ని గుర్తుపట్టని వారు కూడా ఉన్నారు.గుర్తుపట్టినవాళ్ళు షాక్ కి గురయ్యారు.
కొంపదీసి ఈ లుక్ “సాహో” సినిమా కోసం కాదుగా అని కంగారుపడ్డారు.ఈ లుక్ సాహో సినిమా కోసం కానే కాదు.మరి ప్రభాస్ క్లీన్ షేవ్ ఎందుకు చేసుకున్నాడు?

మన డార్లింగ్ ప్రస్తుతం ఇండియాలో లేడు.అమెరికా వెళ్ళాడు.ఓ నెలరోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటాడట.బాహుబలి కోసం అయిదు సంవత్సరాలు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు కదా.అందుకే ఓ నెలరోజులు సినిమా ప్రపంచానికి దూరంగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళాడు.అక్కడైతే అభిమానుల తాకిడి ఎక్కువ ఉండదని, తాను ఎంచక్కా సామాన్యుడిగా బయట తిరగొచ్చని.
మరి అమెరికాలో కూడా భారతీయులు ఉంటారుగా, బాహుబలి అమెరికాలో చాలామంది చూసారుగా, ఎవరైనా గుర్తుపడితే?
అలా గుర్తుపట్టకూడదు అనే ప్రభాస్ ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నాడు.టోపితో పాటు గ్లాసెస్ తగిలించుకున్నాడు.
సడెన్ గా చూసి మనమే పోల్చులేకపోతున్నాం కదా.మరి అక్కడివారు అదేపనిగా గమనిస్తే తప్ప ఎలా గుర్తుపడతారు? ఇదండీ ప్రభాస్ హాలిడే ప్లాన్.







