టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిపై పైచేయి సాధించాడన్న వార్త ప్రస్తుతం మీడియాలోను, సోషల్ మీడియాలోను హైలెట్ అవుతోంది.ఎన్టీఆర్ మెగాస్టార్‌పై పైచేయి సాధించడం ఏంటి ? ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం.మా టీవీలో చిరంజీవి హోస్ట్‌గా ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షో అట్టర్ ప్లాప్ ప్లాప్ అయ్యినట్టే అని విశ్లేషకులు తేల్చిపడేశారు.గతంలో నాగార్జున రెండు సీజన్లతో పోల్చుకుంటే వచ్చిన రేటింగ్ కంటే చాలా పూర్ రేటింగ్ వచ్చింది.
చిరు లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, ప్రశ్నలు అడిగే తీరు చాలా బలవంతంగా ఉన్నాయన్న సెటైర్లు వచ్చాయి.ఏదేమైనా మీలో ఎవరు కోటీశ్వరుడులో చిరు ఘోరంగా ఫెయిల్ అయ్యాడన్న అభిప్రాయమే ఎక్కువ మంది వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఇదే మా టీవీలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హెస్ట్‌గా ఓ అదిరిపోయే రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది.
హిందీలో సూపర్ హిట్ అయిన బిగ్‌బాస్ షోను తమిళ్‌లో కమల్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇదే షోను తెలుగులో చేసే ఛాన్స్ ఎన్టీఆర్‌కు దక్కింది.దీనిపై మా టీవీ అధికారిక ప్రటకన చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేదు.
తమ అభిమాన హీరో రోజు టీవీలో కనపడతాడన్న ఆనందంతో వారు పెద్ద పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ షోకు హోస్టర్‌గా వ్యవహరించినందుకు ఎన్టీఆర్‌కు చిరుకు ఎంఈకే షోకు ఇచ్చిన రెమ్యునరేషన్ కన్నా ఎవ్వరూ ఊహించనంత మొత్తాన్ని మా టీవీ ఎన్టీఆర్‌కు ఆఫర్ చేసిందట.
దీంతో ఇప్పుడు అందరూ ఈ షో టీవీలో ఎప్పుడు మొదలవుతుందా ? అని వెయిట్ చేస్తున్నారు.మరోవైపు ఇండస్ట్రీలోను, మీడియాలోను ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌తో చిరుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని గుసగుసలాడుకుంటున్నారు.







