టీడీపీ ఎంపీకీ మోడీ ఆఫ‌ర్‌..!

రాజ‌కీయాలు ఏక్ష‌ణానికి ఎప్పుడు యూట‌ర్న్ తీసుకుంటాయో చెప్ప‌లేం.ఈ రోజు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేస‌రికి మ‌రో పార్టీలోకి జంప్ చేయ‌డం కామ‌న్‌.

ఇప్పుడు ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఎంపీ పార్టీకి మ‌రో పార్టీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌.ఆ పార్టీ టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నుంచి కావ‌డ‌మే ఇక్క‌డ ట్విస్ట్‌.

కాంగ్రెస్‌లో సీనియ‌ర్ పొలిటీషియ‌న్ అయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు.ఆయ‌న ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుంచి పార్టీలో అసంతృప్తితోనే ఉంటున్నారు.

పలుసార్లు ఆయ‌న తీవ్ర‌మైన అస‌హ‌నంతో కూడిన వ్యాఖ్య‌లు సైతం చేశారు.టీటీడీ చైర్మ‌న్ అవ్వ‌డ‌మే జీవిత ల‌క్ష్యంగా పెట్టుకున్న రాయ‌పాటి ఆ కోరిక కాంగ్రెస్‌లో తీర‌లేదు.

Advertisement

టీడీపీలో అయినా తీరుతుంద‌ని భావించారు.ఇక్క‌డ కూడా టీటీడీ చైర్మ‌న్ కోసం చాలా మంది నుంచి తీవ్ర‌మైన పోటీ ఉంది.

దీంతో రాయ‌పాటి తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎంపీగా పోటీ చేయ‌న‌ని, త‌న కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టుతో పాటు త‌న‌కు టీటీడీ ఇవ్వాల‌ని వేడుకుంటున్నా చంద్ర‌బాబు వైపు నుంచి ఎలాంటి సానుకూల‌తా రావ‌డం లేదు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఓ షాకింగ్ వార్త ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.అసంతృప్తితో ఉన్న టీడీపీ ఎంపీ రాయ‌పాటిని ప్ర‌ధాని మోడీయే క‌మ‌ళ‌ద‌ళంలో చేర్చుకునేందుకు ఆస‌క్తితో ఉన్నార‌ట‌.

గుజ‌రాత్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ ద్వారా రాయ‌పాటిని బీజేపీలోకి ర‌మ్మ‌న్న ఆహ్వానం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.అయితే ఈ ఆఫ‌ర్‌కు రాయ‌పాటి నో చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని చాప‌కింద నీరులా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎంపీపై వ‌ల‌వేయ‌డం చూస్తుంటే ఫ్యూచ‌ర్‌లో అవ‌స‌ర‌మైతే టీడీపీతో అయినా తెగ‌తెంపులు చేసుకునేందుకు రెడీగా ఉన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

Advertisement

తాజా వార్తలు