“నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” ఈ గొప్ప వాక్యాలు వినగానే కాస్త వయసు పైబడిన వారికి మహాకవి శ్రీశ్రీ రాసిన “మహాప్రస్థానం” గుర్తుకి వస్తుంది.అదే ఈ జెనరేషన్ వారికి మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఠాగూర్” సినిమాలోని పాట గుర్తుకువస్తుంది.
ఈ పాటను రచించింది సుద్దాల ఆశోక్ తేజ.
పల్లవిలో మహాప్రస్థానం వాక్యాలు వాడినా, వాటికి తన శైలీ జోడించి అక్షరాలతో భావోద్వేగాలను రగిలించారు అశోక్ తేజ.రచనపరంగా, తెలుగు సినిమా చరిత్రలోని అతిగొప్ప పాటల్లో ఆ పాట కూడా మిలిగిపోతుంది.అంత గొప్ప రచన కాబట్టే ఆ పాటకు ఉత్తమ గేయరచయితగా ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నారు అశోక్ తేజ.
ఆ తరువాత స్టాలీన్ సినిమాలో “సూర్యుడే సెలవని” అనే పాటను కూడా అద్భుతంగా రచించారు ఆశోక్ తేజ.విప్లమాత్మక భావాలు, సగటు తెలంగాణ కవిలో కనిపించే సామాజిక థృక్పథం అశోక్ తేజ రచనల్లో అభరణాలని చెప్పవచ్చు.అందుకే చిరంజీవి సినిమాలో సోషల్ ఎమోషన్స్ పాట ఉంటే అది అశోక్ తేజ రాయాల్సిందే అని అనుకునేవారు సినీజనాలు.
ఇప్పుడు ఖైదీనం 150లో కూడా “నీరు నీరు” అనే మంచి పాట ఉంది.
కాని ఈసారి రచయిత అశోక్ తేజ కాదు, రామజోగయ్యశాస్త్రీ.మరి తనకి నేషనల్ అవార్డు పాట రాసిన అశోక్ తేజకి కాకుండా, ఈ పాటని కొత్తగా రామజోగయ్య శాస్త్రీకి ఎందుకు ఇచ్చినట్లు వినాయక్?
తాజాగా, భద్రచలంలోని ఓ సభలో మాట్లాడిన అశోక్ తేజ, ఖైదీనం 150లో తనకి నప్పే పాట ఉన్నా, ఆ పాట తనకివ్వడం వినాయక్ కి ఇష్టం లేదని, అందుకే రాయలేకపోయాను, రాష్ట్రాలు విడిపోయాక తన కెరీర్ నెమ్మదించింది, అయినా 2,204 పాటలు రాసిన నేను అవకాశాల కోసం ఎవరి దగ్గర చేయిచాపి అడగను అని వినాయక్ ని ఉద్దేశించి ఓ షాకింగ్ స్టెట్మెంట్ ఇచ్చారు ఈ సీనియర్ రైటర్.మరి వినాయక్ కి నిజంగానే ఈ తెలంగాణ – ఆంధ్ర ఫిలింగ్ ఉందంటారా?







