స‌మంత డూప్‌...అచ్చంగా స‌మంతే

మనిషిని పోలిన మనుషులు ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌న్న సూక్తి ఉంది.గ‌తంలో ఇరాక్ నియంత స‌ద్దాం హుస్సేన్ కూడా త‌న ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు త‌న డూప్‌ల‌నే బ‌య‌ట‌కు పంపించేవార‌న్న సంగ‌తి ప్ర‌పంచానికి తెలిసిందే.

 Actress Samantha Look Alike Found-TeluguStop.com

స‌ద్దాం సంగ‌తి అలా ఉంటే ఇప్పుడు సెలబ్రిటీల మాదిరి అచ్చు గుద్దినట్టు ఉన్న కొందరు వ్యక్తులు ఈ మధ్య లైమ్ లైట్ లోకి వస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డూప్‌లా ఉన్న ఓ వ్య‌క్తి ఇటీవ‌ల బాగా పాపుల‌ర్ అయ్యారు.

త‌ర్వాత అబ్దుల్ క‌లాం – సల్మాన్ ఖాన్ – షారూఖ్ ఖాన్ – తమన్నా ఇలా తదితరుల డూప్స్ ఆయా సెల‌బ్రిటీల ఫ్యాన్స్‌కే షాక్ ఇచ్చారు.ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో సెల‌బ్రిటీ డూప్ సైతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

త్వరలో తెలుగింటి కోడలు గా మారనున్న చెన్నై బ్యూటీ సమంత పోలికలతో ఉన్న అషు రెడ్డి ప్రస్తుతం తన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.అషు రెడ్డి కూడా తెలుగమ్మాయే కాగా ఈమె సమంత పలికిన పాపులర్ డైలాగ్స్ ని డబ్ స్మాష్ తో చెప్పి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

అషు రెడ్డి డ‌బ్ స్మాష్ వీడియోలు చూసేందుకు స‌మంత ఫ్యాన్స్ ఆస‌క్తి చూపుతున్నారు.ఈ అమ్మాయికి 40 లక్షల ఫాలోవర్స్ ఇన్ స్ట్రాగ్రామ్ లో ఉన్నారంటే సమంత క్రేజ్ ని ఈ అమ్మడు ఏ విధంగా క్యాష్ చేసుకుంటుందో తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube