సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ అనే టీవి రియాలిటి షో ఇక్కడ ఎంతమందికి తెలుసో కాని, ఆ షో లేకపోయింటే, హాట్ బ్యూటి సన్ని లియోన్ ఇంతమందికి తెలిసుండేది కాదు.బిగ్ బాస్ 5 సీజన్ తో మనదేశంలోకి తిరిగి అడుగుపెట్టింది సన్ని.
ఆ షో వలన దక్కిన పాపులారిటి, సినిమా అవకాశాల కారణంగా పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి, సినిమా ప్రపంచంలో సెటిల్ అయిపోయింది.
నాలుగేళ్ళ క్రితం ఆ షోలో పార్టిసిపెంట్ గా వెళ్ళిన సన్నీ, ఇప్పుడు అదే షోకి జడ్జ్ గా వెళ్ళనుంది.
అయితే సీజన్ మొత్తం పూర్తయ్యేవరకూ సన్ని జడ్జిగా ఉండదు.కేవలం ఈ వారం, ఓ స్పెషల్ టాస్క్ మీద సన్ని జడ్జిమెంటు ఇవ్వడానికి వెళ్తుంది.
ఈవారం కఠినంగా వ్యవహరించి ఎలిమినెషన్ కి వెళ్ళె పోటీదారులని కూడా సన్నియే నిర్ణయిస్తుందట.
చాలాకాలం తరువాత సన్ని బిగ్ బాస్ కి వస్తుండటంతో, టీఆర్పీ రేటింగ్ మోత మోగిపోవటం ఖాయమని భావిస్తున్నారు విశ్లేషకులు.
చూశారా .నాలుగేళ్ళలో సన్ని లియోన్ ఇమేజ్ ఎక్కడినుండి ఎక్కడికి వెళ్ళిందో!







