ATM లేదా బ్యాంక్ లైన్ లో గంటల తరబడి నిల్చోని, కరెన్సి నోట్లు మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉందా? మీరే గనుక ఢిల్లీలో నివసిస్తోంటే మీ బదులుగా ఇంకొకరిని ATM లేదా బ్యాంక్ ముందు నిల్చోబెట్టవచ్చు.సరిగ్గా మీ టైమ్ రాగానే నిల్చున్నవాడు లైన్ బయటకి వస్తాడు, మీరు లైన్ లోనికెళ్ళి మీ పని పూర్తిచేసుకోవచ్చు.
కొత్తగా www.BookMyChotu.com అనే స్టార్టప్ కంపెనీ ఒకటి మొదలయ్యింది ఢిల్లీలో.ఈ సైట్ లో ఒక చోటూని (పనిలో సహాయం చేసేవాడు) మీరు బుక్ చేసుకోవచ్చు.ఇంటి సామాను, క్లీనింగ్, షిఫ్టింగ్, ఫంక్షన్ పనులు, ఇంటి పనులు ఆ చోటూతో చేయించుకోవచ్చు.ఇప్పుడు అవసరానికి తగ్గట్టు తమ సర్వీసులు బ్యాంక్ ముందు లైన్ కి కూడా విస్తరించారు బుక్ మై చోటూ ఓనర్లు.
అయితే వీరేమి ఉచితంగా మీకు సేవలు చేసి పెట్టరు లేండి.గంటకి 90 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
ప్రస్తుతానికైతే వీరి సేవలు ఢిల్లీ వరకే.అక్కడ హిట్ అయితే, మిగితా ప్రాంతాలకి కూడా విస్తరింపజేస్తారట.







