టీవిల్లో రకరకాల యాడ్స్ చూస్తుంటాం.ఒక ప్రముఖ హీరో లేదా హీరోయిన్ వచ్చి ఈ క్రీమ్ రాసుకోండి, వాడితే మీరు తెల్లగా నిగనిగలాడిపోతారని చెబుతారు.
నిజంగానే అలా జరుగుతుందా ? ఓ స్పోర్ట్స్ స్టార్ వచ్చి ఇది తాగండి, మీరు ఎత్తు పెరుగుతారు అని చెబుతాడు.అదేలా సాధ్యం అనేది తరువాతి విషయం.
ఈ మందు వాడితే అలా అవుతుందని, ఇంకేదో తగ్గితే లావు తగ్గుతారని, అది కొంటే లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు అని ఏదేదో చెబుతారు.విషయం గోరంత ఉంటే కొండంత చెబుతారు.
సెలబ్రిటీల మాట విని, సదరు ప్రాడక్ట్స్ ని కొని, మళ్ళీ వాటిపట్ల సంతృప్తిగా లేక, ఇబ్బందులు పడతారు సామన్య ప్రజలు.
ఇకనుంచి ఇలా చేసే సెలబ్రేటిలను ఊరికే వదిలిపెట్టం అంటోంది భారత సర్కారు.
ఇలా గాలిలో మేడలు చూపించే యాడ్స్ చేసే సెలబ్రిటీలపై మొదట 10 లక్షల జరిమానా విధిస్తారట.ఒక్కసారి జరిమానా విధించాక అదే తప్పు మళ్ళీ చేస్తే 50 లక్షల ఫైన్ విధిస్తారట.
ప్రస్తుతానికైతే ఇది ప్రపోజల్ మాత్రమే.దీన్ని త్వరలోనే అమలుపరిచే అలోచనలో ఉంది భారత ప్రభుత్వం.
ఇదే జరిగితే, చెత్త చెత్త యాడ్స్ తో రావడం మానేస్తారు మన సినిమా, క్రికేట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తారలు.ఎంతైనా మంచి పేరు ఉన్నప్పుడు, తమ మాటలని నమ్మే జనాలు ఉంటారని తెలిసినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా వాళ్ళు.







