మహేష్ బాబు మూఢనమ్మకం

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, నమ్మకాలు ఫాలో చేయనివారిని దొరకబట్టడం కష్టం.అందరికీ ఏదో ఒక సెంటిమెంటు ఉంటుంది.

 Mahesh Babu Didn’t Leave His Sentiment-TeluguStop.com

అలా సెంటిమెంట్లని పట్టించుకునేవారిలో మహేష్ బాబు కూడా ఉన్నాడు.ఈ సూపర్ స్టార్ తన సినిమా ఓపెనింగ్ కి వెళ్ళడు.

తన ఏ కొత్త సినిమా ప్రారంభమైనా, ఆ సినిమా పూజ కార్యక్రమానికి వెళ్ళే అలావాటు మహేష్ కి లేదు.

జులైలో ప్రారంభమైన తన 23వ సినిమా పూజకి మురుగదాస్ ఆండ్ టీమ్, మహేష్ తరఫున మహేష్ భార్య నమ్రత వెళ్ళింది.

ఈరోజు కూడా అంతే.తన 24వ సినిమా ఓపెనింగ్ జరిగితే, హైదరాబాద్ లోనే ఉన్న మహేష్ ముహూర్తానికి వెళ్ళలేదు.

ఎప్పటిలాగే తన సతీమణి నమ్రత వెళ్ళింది.దర్శకుడు కొరటాల శివతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కే.రవిచంద్రన్, నిర్మాత దానయ్య, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని అనుకోలేదట.

ప్రస్తుతానికైతే ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సెప్టెంబరులో సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube