నాగచైతన్యకి పెద్ద ఎదురుదెబ్బ

ఓ సంవత్సర కాలంగా వాయిదా పడుతూ పడుతూ, మొత్తానికి ఈ నెల 11న విడుదల అవుతోంది సాహసం శ్వాసగా సాగిపో.ఏ మాయ చేసావే తరువాత నాగచైతన్య – గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి.కాని మోడి సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నాగచైతన్య సినిమాకి నష్టం తీసుకొచ్చేలా ఉంది.

 Nagachaitanya Lands Into Trouble With 500 And 1000 Rupee Notes Ban-TeluguStop.com

500,1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడంతో చిక్కుల్లో పడింది సాహసం శ్వాసగా సాగిపో.ఇవాళ, రేపు ATM పనిచేయవు కాబట్టి, ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చుపెట్టాలనుకుంటారు ఎవరైనా.ముఖ్యాంగా 500,1000 రూపాయల నోట్లు చేతిలో ఉన్నవారు, ఆ నోట్లను మార్చుకునేదాకా వాటిని ఖర్చుపెట్టలేరు.

దీంతో రానున్న వారం రోజుల్లో సినిమా కలెక్షన్లు ఎలా ఉంబోతున్నాయో అని కంగారుపడుతోంది ట్రేడ్ ప్రపంచం.

నవంబరు 11న ఇటు నాగచైతన్య సినిమా, అటు అల్లరి నరేష్ నటించిన “ఇంట్లో దెయ్యం, నాకేం భయం” విడుదల అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో వీరి సినిమాలు విడుదల అవడం నిజంగా దురదృష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube