నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఏ రేంజ్ ఫాంలో ఉన్నాడో తెలిసిందే.ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ అయిన కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మన్ రెండు సూపర్ హిట్ సాధించి నాని సత్తా మరోసారి చాటాయి.
ఇక ప్రస్తుతం నాని మరో రెండు వారాల్లో మజ్ఞుగా రానున్నాడు.ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ సినిమాతో కూడా నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.
ఇక ఆ సినిమా తర్వాత నేను లోకల్ సినిమా చేస్తున్న నాని ఆ మూవీలో క్రేజ్ కోసం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సాంగ్ పాడిస్తున్నారట.
నక్కిన త్రినాధరావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో తారక్ సాంగ్ ఉంటే అదో స్పెషల్ క్రేజ్ అని ప్రత్యేకంగా దేవి ఎన్.టి.ఆర్ ను ఒప్పించి ఈ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట.ఇప్పటికే తన సినిమాలో కాకుండా కన్నడ పవర్ స్టార్ పుణీత్ రాజ్ కుమార్ సినిమాలో కూడా సాంగ్ పాడిన తారక్ ఇప్పుడు తెలుగులో వేరే హీరోకి పాడటం విశేషం అని చెప్పాలి.
ఇప్పటిదాకా కేవలం స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ మాత్రమే అందించిన తారక్ ఈ సినిమాతో సాంగ్ కూడా పాడటం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు.







