అక్కినేని కోడలిగా సమంత దాదాపు కన్ ఫాం అయినట్టే.అందరికి తెలిసేలా అందరు కనుక్కునేలా ఎవరికి వారు మాట్లాడుతున్నా మ్యాటర్ ఇది అని మాత్రం ఎవరు బయట పెట్టట్లేదు.
ఏది ఏమైనా చైతు, సమంతల లవ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.అయితే ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీలో అందరి మనసులను గెలుచుకునే ప్రయత్నంలో సమంత ఆ ఫ్యామిలీలో ఉన్న అందరితో కలిసి తన ఫీలింగ్ షేర్ చేసుకుంటుంది.
ఇప్పటికే నాగార్జునతో చర్చలు జరిపిన సమంత తాజాగా అమలతో కూడా మాట్లాడటం జరిగిందట.
అయితే ఈ సీక్రెట్ మీటింగ్ ను ఎవరో ఫోటోలో బంధించారు.
ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి.ఇక అత్తాకోడళ్లు సీరియస్ డిస్కషన్ లో ఉన్న ఈ పిక్ చూసి అక్కినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
మరి ఇక పెళ్లి ముహుర్తం కూడా ఏదో బయట పెట్టేస్తే ఇక వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి.







