ఎన్టీఆర్ కథ నితిన్ కు అందింది..!

టాలీవుడ్లో ఏ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి సినిమా తీస్తుందో ఊహించడం కొద్దిగా కష్టమే.అంతెందుకు ఒకరికి అనుకున్న కథను మరొకరితో చేస్తుండటం చాలాసార్లు జరుగుతుంటుంది.

తాజాగా అలాంటి సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథతో ప్రేమకథల్లో కొత్త కోణాన్ని చూపించిన దర్శకుడు హను రాఘవపుడి ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోసం ఓ కథ రాసుకున్నాడు.తారక్ తో మీటింగ్ ఏర్పాటుచేసుకుని కథ వినిపించిన హను జూనియర్ మెప్పుపొందాడు కాని తను మాత్రం చేసేందుకు నిరాకరించాడు.

ఇక తర్వాత ఆ కథను అఖిల్ కు వినిపించడంతో అఖిల్ కూడా మనసు పడ్డాడు.కాని కమిట్మెంట్ కారణాల వల్ల అది మిస్ అయ్యింది.అయితే ఇప్పుడు హను రాఘవపుడి అదే కథతో నితిన్ తో సినిమా తీస్తున్నాడు.14 రీల్స్ బ్యానర్లో రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా జూనియర్ మెచ్చిన కథ కాబట్టి చిత్రయూనిట్ అంతా నమ్మకంగా ఉన్నారు.ఇక రీసెంట్ గా అఆతో హిట్ అందుకున్న నితిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది.

మరి జూనియర్ కథను లక్కీగా అందుకున్న నితిన్ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

Advertisement
 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?

తాజా వార్తలు