ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో చాలామంది స్త్రీలు ఇబ్బందిపడుతూ ఉంటారు.ట్రాక్ తప్పిన పీరియడ్స్ కష్టంగానే అనిపిస్తాయి.
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఇలా జరుగుతుంది.అయితే కొన్నిరకాల ఆహారం పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు.
మీ పిరియడ్స్ ని సరైన ట్రాక్ లో పెట్టవచ్చు.
* ప్లాంట్ ప్రొటీన్ హార్మోన్స్ విడుదలలో సమతుల్యత రప్పించడానికి సహాయపడతాయి.
ఉడకబెట్టిన గుడ్లు, పీనట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ లో ప్లాంట్ ప్రోటీన్లు బాగా దొరుకుతాయి.
* ఆహారపు అలవాట్లు, ఇతర లైఫ్ స్టయిల్ అలవాట్లు సరిగా లేకుంటే అది ఓవరియన్ బ్లడ్ వెసెల్స్ పై చెడు ప్రభావం చూపుతుంది.
దాంతో హార్మోన్స్ విడుదలతో పాటు, రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు.ఈ బాధలనుంచి తప్పించుకోవాలంటే ఫిష్ ఆయిల్ తో తినడం మేలు.
చేపల్లో దొరికే ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ ఈ సమస్యకు మంచి పరిష్కారం మార్గం.
* తెలుపు రంగులో ఉండే ఆహారం తినకపోతేనే మంచిది.
షుగర్, వైట్ బ్రెడ్, బియ్యం, వైట్ ఫ్లోర్, వైట్ పొటాటో లాంటి ఆహరం ఇన్సులిన్ లెవెల్స్ పై తీవ్ర ఫ్రభావం చూపుతాయి.దింతో పిరియడ్స్ సైకిల్ పై కూడా ఎఫెక్ట్ పడొచ్చు.
* ఐరన్ శాతం బాగా దొరికే తిండి తినాలి.రక్తస్రావం జరుగుతుంది కాబట్టి శరీరంలో ఎప్పుడూ ఐరన్ శాతం కిందపడకుండా చూసుకోవాలి.
లేదంటే పిరియడ్స్ సంబంధిత సమస్యలు పెరిగిపోతాయి.
* విటమిన్ డి ఉండే ఆహారపదార్థాలు రెగ్యులర్ పిరియడ్స్ రావడానికి సహాయం చేస్తాయి.
కాబట్టి విటమిన్ డి దొరికే అహారంపై ప్రేమ పెంచుకోవాలి.