జియో టెలికాం మార్కేట్ ని గడగడలాడిస్తోంది.పచ్చిగా చెప్పాలంటే మిగితా నెట్వర్క్ కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇన్నిరోజులు జియోకి పోర్టెబిలిటి సదుపాయం ఇంకా రాలేదేమో అని చిన్నగా సంతృప్తిపడ్డ నెట్వర్కింగ్ కంపెనీలకు దుర్వార్త అందనే అందింది.జియోకి MNP సదుపాయం ఈ నెల 5వ తేది నుంచి అందుబాటులోకి రానుంది.
దానర్థం, మీరు వాడుతున్న నంబర్ ని జియోకి మార్చుకోవచ్చు.
ఎలా మార్చుకోవాలో మీకు తెలియంది కాదు కాని, మొదట మీరు పోర్ట్ అవ్వాలి అనుకుంటున్న నంబర్ నుంచి 1900 కి PORT అనే మెసెజ్ పెట్టండి.
మీకు మీ ఆపరేటర్ నుంచి ఓ కోడ్ మెసెజ్ ద్వారా వస్తుంది.అది 15 రోజులవరకే పనిచేస్తుంది.అంటే 15 రోజుల లోపే మీరు జియో పోర్ట్ కి అప్లై చేయాల్సి ఉంటుంది.
ఆ కోడ్ తీసుకోని దగ్గరలోనే ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్ కి వెళ్ళి ఆ కోడ్ తో పాటు, మీ వివరాలు, ఐడి ఫ్రూఫ్ సబ్మిట్ చేయండి.7 రోజుల్లో 19 రూపాయల ఛార్జీలతో మీ నంబర్ జియోకి మారిపోతుంది.అయితే జియో యాక్టివేట్ అవడానికి ముందు, ఓ రెండు గంటలు మీ నంబర్ పూర్తిగా పనిచేయదు.
ఒక్కసారి యాక్డివేట్ అయ్యాక, మీరు అదే నంబర్ తో జియో వినియోగదారుడిగా మారిపోతారు.ఇక గుర్తుచేయాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కసారి జియోకి పోర్ట్ అయ్యాక, తరువాతి 90 రోజుల వరకు మీరు నెట్వర్క్ మార్చలేరు.