కరివేపాకు వలన ఇన్ని లాభాలా!

ఎవరైన మనల్ని పట్టించుకోకపోతే కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు అని అంటాం మనం.సామెత సరదాగా ఉంటుంది కాని, కూరలో కరివేపాకు తీసి పడేయ్యడం సరదా పని కాదు.

 Hair And Skin Benefits Of Curry Leaves Fibre Pimples Digestion ,curry Leaves , F-TeluguStop.com

ఎందుకంటే కరివేపాకులో ఐరన్, ఫోలిక్ ఆసిడ్ బాగా లభిస్తాయి.ఐరన్ డెఫిషియెన్సితో బాధపడకూడదంటే కరివేపాకు చాలా అవసరం.

జర్నల్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ కథనం ప్రకారం, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులోకి తెచ్చే శక్తి కరివేపాకులో ఉంది.ఇది ఇన్సులిన్ ఆక్టివిటిని చాలా ప్రభావితం చేస్తుందట.

కరివేపాకులో ఫైబర్ కూడా బాగా దొరుకుతుంది.పొద్దున్నే కరివేపాకు తింటే జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగం.

కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గడానికి కూడా కరివేపాకు సహాయపడుతుంది.దగ్గుతో బాధపడుతున్న వారికి కరివేపాకు ఔషధంలా పనిచేస్తుంది.

ఇందులో లభించే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇంఫ్లేమెటరీ లక్షణాలు ఛాతి నొప్పి, దగ్గు, జలుబుతో పోరాడతాయి.

మొటిమలతో ఇబ్బంది పడేవారు చవకగా కరివేపాకు సహాయం తీసుకుంటే మంచిది.

యాంటి-బ్యాక్టిరియా, యాంటి-ఫంగల్ లక్షణాలు ఉంటాయి కరివేపాకులో.మీ చర్మ అరోగ్యానికి కరివేపాకు చాలా మంచిది.

కరివేపాకులోని కెంప్ఫెరాల్, యాంటిఆక్సిడెంట్స్ లివర్ అరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.మద్యం అతిగా సేవించేవారు రోజూ కరివేపాకు తింటే, కుదిరినంత సేపు లివర్ ని కాపాడుకోవచ్చు.

జుట్టు బాగా ఎదగడానికి, బలంగా ఉండటానికి కూడా కరివేపాకు పనికివస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube