చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా 150 వ సినిమా నిర్మితం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పవర్ స్టార్ చాలా ఎక్కువగా తన అన్నకు సూచనలను ఇచ్చాడట.
వాటిని చిరు కూడా ఆమోదించాడట.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను సునీల్ కి అఫర్ ఇచ్చారట.
సునీల్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవటంతో ఆ పాత్రకు వెన్నెల కిషోర్ ని తీసుకుందామని భావించారు.
అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పాత్ర కోసం అలీ ని సూచించారట.
అలీకి పవర్ స్టార్ కి ఉన్న స్నేహ బంధం మనకు తెలిసిందే.అలాగే సినిమాలో రాజకీయంగా,అభిమానుల మనస్సులను హత్తుకునేలా డైలాగ్స్ ఉండటానికి మాటల రచయత బుర్రా సాయిమాధవ్‌ను సూచించారట.
పవన్ నటించిన ‘గోపాలా గోపాలా’ సినిమాకి సాయిమాధవ్ మాటల రచయితగా పనిచేసాడు.
ఇక లేటెస్ట్ గా హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేయటంలో కూడా పవన్ హస్తం ఉందట.
ఇలా అన్నివిధాలా అన్నయ్య 150 వ సినిమాలో తాను కొన్ని జాగ్రత్తలు తీసుకోని సక్సెస్ కావటానికి తన వంతు సాయం చేస్తున్నాడట పవన్.







