కాఫీ గింజలతో ఉపయోగాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే

ఉదయం లేవగానే కాఫీ త్రాగందే ఏ పని చేయాలనీ అనిపించదు.అలసట,బడలిక ఉన్న సమయంలో కూడా కాఫీ త్రాగుతూ ఉంటాం.

 Uses Of Coffee Beans-TeluguStop.com

కాఫీ అలసటను దూరం చేయటానికే కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.ఆ ఉపయోగాలపై ఒక లుక్ వేద్దాం.

కాఫీ పొడితో నలుగు పిండి తయారుచేసుకోవచ్చు.ఆశ్చర్యం కలుగుతుంది కదా ! అయితే ఇది నిజం.

కాఫీ పొడిలో కొంచెం కొబ్బరినూనె వేసి కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయుట వలన ముఖం మృదువుగా మారటమే కాకుండా కాంతివంతంగా మారుతుంది.

కాఫీ డికాషన్ ని తలకు పట్టించి తలస్నానము చేస్తే జుట్టు పట్టుకుచ్చు లా ఉంటుంది.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

కాఫీకి దుర్వాసనలను తొలగించే లక్షణం కూడా ఉంది.కారు,గదులు,ఫ్రిడ్జ్ ల నుండి దుర్వాసన వస్తుంటే….

ఒక కప్పులో కాఫీ గింజలు వేసి ఉంచితే దుర్వాసన ఇట్టే మాయం అవుతుంది.

చేతుల నుంచి వెల్లుల్లి,ఉల్లిపాయ వాసన ఒక పట్టాన పోవు.

అలాంటప్పుడు కొంచెం కాఫీ పొడిని చేతులకు రాసుకొని శుభ్రం చేసుకుంటే వాసన పోతుంది.

కొన్ని పాత్రలకు జిడ్డు,మురికి తొందరగా వదలవు.

అప్పుడు కొంచెం కాఫీ పొడితో శుభ్రం చేస్తే సులువుగా జిడ్డు,మురికి తొలగిపోతాయి.

పిల్లలు వాడే షూ దుర్వాసన వస్తూ ఉంటుంది.

ఆ వాసన పోవాలంటే కొంచెం కాఫీ పొడి చల్లితే కొంచెం సేపటికి దుర్వాసన పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube