ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డైరక్టర్స్ లిస్ట్ లో మొదట పేరు కచ్చితంగా కొరటాల శివదే అని చెప్పాలి.రచయిత దర్శకుడిగా మారితే సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో తాను తీసిన మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో రుచి చూపించిన కొరటాల శివ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు.
ఇక దాదాపు తుది దశకు చేరుకున్న ఈ సినిమా తర్వాత కొరటాల శివ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఓ సినిమా తీస్తాడని టాక్ ఉంది.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం చెర్రితో సినిమా అంటే చొరవ చూపించని కొరటాల శివ మళ్లీ శ్రీమంతుడు అదేనండి సూపర్ స్టార్ మహేష్ తోనే పనిచేయాలనే ఉద్దేశంలో ఉన్నాడట.
ఈ మధ్యనే మహేష్ కొరటాల శివలు కలిసి మాట్లాడుకున్నారట.మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ కచ్చితంగా కొరటాల శివ సినిమానే చేస్తాడు అని ఫిల్మ్ నగర్లో గట్టిగా వినబడుతున్న మాట.సో మరి చెర్రికి హ్యాండ్ ఇచ్చి మహేష్ తో మరో సినిమా తీయడం పట్ల కొరటాల ఆలోచన ఏమై ఉంటుందా అన్న సందిగ్ధంలో ఉన్నారు మెగా అభిమానులు.ఇక ఈ న్యూస్ తో మహేష్ మరో సూపర్ హిట్ సినిమా చేస్తున్నాడనే ఫీల్ తో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్.







