ఓ పక్క సుల్తాన్ కలక్షన్స్ తో అదరగొడుతుంటే మరో పక్క సోషల్ సైట్స్ లో ఆ సుల్తాన్ భాయ్ తో బంగారు బాబు అదేనండి మన విక్టరీ వెంకటేష్ దిగిన ఓ పిక్ హల్ చల్ చేస్తుంది.ఈ పిక్చర్ ఎక్కడికి ఏ సందర్భంలో వారిద్దరు ఇలా సుజికి స్కూటీల మీద ఫోజులిచ్చారన్నది తెలియదు కాని అక్కడ సుల్తాన్ గా కేక పెట్టిస్తున్న సల్మాన్ మన టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తో దిగిన ఈ ఫోటో తెగ సందడి చేస్తుంది.
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ మధ్య సత్సంబంధాల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.
మన మార్కెట్ పై గురి ఉన్న బీ టౌన్ బాబులు ఇక్కడ స్టార్స్ తో మంచి అనుభంధంతో ఉంటారు.
ఆ క్రమంలో దిగిన సల్మాన్, వెంకటేష్ ల ఫోటోనే ఇది.అయితే ఇదేదో షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటో లా మాత్రం లేదు.వెంకీ ముంబై వెళ్లినప్పుడో లేక సల్మాన్ ఇక్కడ షూట్ కు వచ్చినప్పుడే దిగిన ఈ పిక్ అటు సల్మాన్ ఫ్యాన్స్ తో పాటుగా వెంకటేష్ అభిమానులను భలే ఎట్రాక్ట్ చేస్తుంది.
.






