జగన్ పార్టీ ఐస్‌క్రీంలా కరిగిపోతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపిలో పెద్ద దుమారమే రేపుతోంది.గత కొంత కాలంటో గడప గడపకు వైసిపీ కార్యక్రమ నేపధ్యంలో వైసిపీ నేతలు కాంగ్రెస్‌కు చెందిన వారిని పదే పదే కలుస్తుండటం, తమ పార్టీలోనికి రావాలని ఆహ్వనాలందించడంపై మండి పడుతూ, సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో విభజనకు కాంగ్రెస్ బాధ్యులంటూ వైసిపీ, టిడిపీలు బూతద్దంలో చూపితే, ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీకి ఇంటి దొంగలే ద్రోహం చేశారని, .ఆరోపించిన ఆయన.మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మరికొందరు కాంగ్రెస్‌ని వీడటం శోచనీయమని అన్నారు.ఐస్‌క్రీంలా కరిగి పోయే పార్టీకి తమ ఉన్నతమైన పదవులు అనుభవించిన నేతలు వెళ్లడం సిగ్గుచేటని రఘువీరా అన్నారు.
ఏపీ కేబినెట్‌లో సమర్థవంతమైన మంత్రులు లేరని ఆయన వ్యాఖ్యానించారు.హోదా అంశం చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని, కేబినెట్ తీర్మానం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని ఆయన అన్నారు.
గతంలో ఎన్నో రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం ద్వారానే హోదా ఇచ్చారని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో , ప్రత్యేకహోదాపై కేవీపీ బిల్లుకు అందరూ మద్దతు తెలపాలన్నారు.