మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కత్తి రీమేక్ కోసం తనను విలన్ గా మొదట అడిగారని జగపతి బాబు అన్నారు.అయితే వారు అడిగిన వెంటనే తాను కాస్త ఆలోచిస్తానని చెప్పిన జగ్గుభాయ్ ఆ తర్వాత వారి నుండి ఎలాంటి కబురు రాకపోయే సరికి సైలెంట్ గా ఉన్నాడట.
ఈ గ్యాప్ లో ఓ బాలీవుడ్ నటుడిని ఈ సినిమాలో విలన్ గా పెట్టే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు వినాయక్, రాం చరణ్ లు.మరి ఏమైందో ఏమో గాని మళ్లీ విలన్ గా జగపతి బాబునే పెట్టాలని అనుకుంటున్నారట.
మొదట అడిగారు కాని తను కాస్త సమయం అడిగే సరికి తర్వాత మందలించలేదు.ఇక తాను కూడా ఆ సినిమా గురించి ఆలోచించడం మానేశానని అన్నారు జగ్గు భాయ్.
మరి ఇంతకీ చిరుతో విలన్ గా నటించడం ఇష్టం ఉందా లేదా అన్నది చెప్పలేదు కాని అడిగారు మళ్లీ వాళ్లే సైలెంట్ అయ్యారు అంటూ తప్పు ఆ సినిమా యూనిట్ మీద నెట్టేసి తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు జగపతి బాబు.మరి ఫైనల్ గా మెగా విలన్ ఎవరు అన్నది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
.






