భార్య వయసు 71, భర్త వయసు 17, అంకెలు రివర్స్ గా ఉన్నాయి కదా అని ఇదేదో అంకెల గారడి అనుకునేరు.కాదు కాదు, నిజంగానే ఈ వయసులో ఉన్నవారు ఒకరిని ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమంచుకోని పెళ్ళి చేసుకున్నారు.
ఈ వివాహం టెనెన్సిలో జరిగింది.
ప్రేమకు రంగు, రూపు, మతం, కులం, వయసుతో సంబంధం లేదు అని అంటారు.
ఈ మాట నిజమే అని మనల్ని నమ్మించడానికే కావచ్చు, కొంతమంది కేవలం మనసుని చూసి, నిజాయితీగా ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంటారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరి కూడా అలాంటిదే.
ఆవిడ పేరు ఆల్మెడా.2013 సంవత్సరంలో డయాబెటిస్ తో భర్త డోనాల్డ్ చనిపోయాడు.అప్పటికి వీరికి నలుగురు పిల్లలు.భర్త చనిపోయిన బాధలోంచి పూర్తిగా బయటపడక ముందే పెద్ద కుమారుడు రాబర్ట్ మూర్ఛ వ్యాధితో చనిపోయాడు.దాంతో అల్మెడా బాధ మరింత పెరిగిపోయింది.
కుమారుడు రాబర్ట్ అంతక్రియలు జరుపుతుండగా, అతని భార్య తరుఫు బంధువు గేరి ఆల్మెడాకి పరిచయమయ్యాడు.
ఇద్దరిది బామ్మ మనవల వయసు.ఆల్మెడా మనవడు కూడా గేరీ కంటే పెద్దవాడు.
అయినా ఆల్మెడా – గేరీ ఆలోచనలు, మనసులు కలిసాయి.కొంతకాలానికి తమ మధ్య ఉన్నది ప్రేమని గుర్తించారు.
అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ తో విడిపొయిన గేరీ అల్మెడాతో లవ్ స్టోరి మొదలుపెట్టాడు.ఇంకేం .ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు.







