రీల్ లైఫ్ కీ రియల్ లైఫ్ మీ మధ్యన చాలా తేడా ఉంటుంది.కానీ రెండిటి మధ్యన ఉండే గీత మాత్రం చాలా సన్నది, చిన్నది.
సినిమా ఇండస్ట్రీ వారి వ్యవహరాలు చాలా కొత్తగా ఆసక్తికరంగా ఉంటాయి.ముఖ్యంగా భాగస్వాములు ఇద్దరూ సినిమా వారు అయితే వారి మధ్యలో పిల్లలు నలిగే రకం కొత్తగా ఉంటుంది.
మొదటి పెళ్లిని కాదని.వేరొకకరితో జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కవగా ఉండడమే ఇందుకు కారణం.
ఇప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ కు కూడా.ఈ తరహా గొడవలు తప్పడం లేదనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం గౌతమీ తో సహజీవనం చేస్తున్న కమల్ హాసన్ సారికకి పుట్టిన శృతి హాసన్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు.
గౌతమీ ఆమెకి వరసకి పిన్ని అవుతుంది.
ఇప్పటి వరకూ కమల్ – శృతీ కలిసి ఒక్క సినిమాలో కూడా పనిచెయ్యలేదు, మొట్టమొదటి సరి శభాష్ నాయుడు సినిమాలో ఇద్దరూ తండ్రీ కూతుళ్ళు గా నటిస్తున్నారు.ఈ సినిమా కాస్ట్యూమ్స్ బాధ్యత కమల్ హసన్ రెండవ భార్య గౌతమే చూసుకుంటోంది.
ఇక్కడ వచ్చింది అసలు సమస్య.గౌతమి సూచించిన కాస్ట్యూమ్స్ పై శృతి హాసన్ చీటికీ మాటికీ చిరాకు పడుతోందని.
రిజెక్ట్ చేస్తోందని అంటున్నారు.కమల్ హాసన్.
శృతి హాసన్ లు పక్కా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది.కానీ మొదటిసారిగా శృతి నుంచి ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయని యూనిట్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.







