ఓ హీరోకు అనుకున్న టైటిల్ మరో హీరో సినిమాకు పెట్టడం సిని పరిశ్రమలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమం రీమేక్ కు ముందు ‘మజ్ఞు’ అనే టైటిల్ అనుకున్నారు.
కాని ప్రేమం సౌండింగ్ అది కొట్టిన హిట్ బాగుండటంతో ఆ టైటిల్ తోనే నాగచైతన్య వస్తున్నాడు.నాగార్జున 1987లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో మజ్ఞు సినిమా చేశారు.
ఇప్పుడు అదే టైటిల్ తో చైతు వస్తే బాగుంటుందని అనుకున్నారంతా.కాని చైతు ఆ టైటిల్ మిస్ చేసుకున్నాడు.
చైతు వదిలిన ఆ టైటిల్ నాని తను విరించి వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు పెడుతున్నారట.ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా మారిన విరించి వర్మ సరైన కథ కోసం ఇన్నిరోజులు వెయిట్ చేశాడు.
నాని, విరించి వర్మల కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాకు మజ్ఞు టైటిల్ ఫిక్స్ చేశారట.రీసెంట్ గా రిలీజ్ అయిన జెంటిల్ మన్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని మజ్ఞుగా ఎలా అలరిస్తాడో చూడాలి.
ప్రముఖ నిర్మాన సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.నాచురల్ స్టార్ గా స్క్రీన్ నేం పడినప్పటి నుండి నాని రేంజ్ పెరిగిపోయింది.
సినిమా సినిమాకు తనలోని టాలెంట్ తో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తూ స్టార్ క్ర్జేజ్ సంపాదిస్తున్నాడు.







