హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో త్రివిక్రం వరుసెంట సినిమాలు చేస్తున్నాడు.త్రివిక్రంకు నిర్మాత చినబాబుకు మధ్య సాన్నిహిత్యం అలా సినిమాలు చేసేలా చేస్తుందనుకున్నారు కాని త్రివిక్రం అడిగినంత రాధాకృష్ణ ఇస్తున్నారట.
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాకు పని చేస్తున్న ప్రతి నెల త్రివిక్రం కు నెలకు 15 లక్షలు అదనంగా ఇవ్వాలట.అది కాకుండా రెమ్యునరేషన్ మరో 10 కోట్లు అంటే దాదాపు ఓ సినిమాకు 11, 12 దాకా వర్క్ అవుట్ అవుతుంది మాటల మాంత్రికుడికి.
తాను సినిమా తీస్తే నిర్మాతకు లాభాల పంటే అందుకే త్రివిక్రంకు అంత డిమాండ్.అయితే త్రివిక్రం ఎంత డిమాండ్ చేసినా సరే చినబాబు మాత్రం అతన్ని వదలకుండా పట్టుకుంటున్నాడు.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తాజాగా అఆ.ఇలా మూడు సినిమాల హిట్ తో వారి కాంబినేషన్ అదుర్స్ అనిపించింది.మరి రానున్న రోజుల్లో కూడా త్రివిక్రం ఈ నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.ఎప్పుడు సింపుల్ గా కనిపించే త్రివిక్రమ్ రేమ్యునరేషాన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు.







