అగ్రనిర్మాత దిల్ రాజు మంచి ఊపు మీద ఉన్నారు.ఈ సంవత్సరం లాభాలు అర్జిస్తూ, మళ్లీ తన పాతరోజుల్ని గుర్తుచేస్తున్నారు.
నైజాంలో అఆ ఇచ్చిన ఊపుతో సూపర్ కిక్ మీద ఉన్న ఈ నిర్మాత, అదే ఊపులో జనతా గ్యారేజ్ నైజాం హక్కులని కూడా కొనేసిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 12న జనతా గ్యారేజ్ విడుదల అవుతోంది.
సరిగ్గా అదేరోజు నాగచైతన్య నటిస్తున్న ప్రేమమ్ ని కుడా విడుదల చేయాలని భావించారు ఆ చిత్రం యొక్క దర్శకనిర్మాతలు.రెండు సినిమాల మధ్య పోటి జరగడం ఖాయం అని భావిస్తున్న తరుణంలో జనతా గ్యారేజ్ హక్కులని కొనేసి ట్విస్ట్ ఇచ్చారు దిల్ రాజు.
ఇప్పుడు జనతా గ్యారేజ్ మాత్రమే ఆగస్టు 12న విడుదల అవుతుంది.ప్రేమమ్ వాయిదా పడుతుంది.
అలా ఎందుకంటే … ప్రేమమ్ నైజాం హక్కులు కూడా దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి.ఈ రెండు సినిమాలు పోటిపడితే దిల్ రాజుకే నష్టం.
అందుకే ప్రేమమ్ నిర్మాతలతో మాట్లాడి దిల్ రాజు ఆ సినిమాని వాయిదా వేయించారని ఫిలింనగర్ టాక్.







