మహేష్ బాబు తన శ్రీమంతుడు సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెంను, తెలంగాణలో సిద్ధాపూర్ గ్రామాల్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.నెల క్రితం బుర్రిపాలెంను సందర్శించిన మహేష్, అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యత ఆరోగ్యానికి, వైద్యానికి ఇస్తానని అక్కడి ప్రజలకు మాటిచ్చారు.
దానికి తగ్గట్టే ఓ స్కూలు బిల్డింగ్, ఇప్పటికే ఉన్న స్కూలుకి అదనపు తరగతులు కట్టిస్తున్న మహేష్, గ్రామ ప్రజల ఆరోగ్యం విషయాన్ని కూడా బాగానే పట్టించుకున్నారు.
విజయవాడకు చెందిన ఆంధ్ర హాస్పిటల్స్‌లో లో బుర్రిపాలెం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
దీనికోసం మహేష్ బాబు హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది.ఇక మహేష్ టీంలో భాగమైన యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్ నిన్న బుర్రిపాలెంలో గడప గడపకి హెల్త్ సర్వే చేపట్టింది.
గ్రామ ప్రజల ఆరోగ్యం గురించి, వారికి అందుబాటులోకి తెవాల్సిన వైద్య సదుపాయల గురించి ఆరాతీసింది.
దాంతో పాటు గ్రామస్థులకు తమ అరోగ్యం పట్ల అవగాహన కల్పించింది ఈ టీమ్.
వీరంతా సిద్ధార్థ, ఆశ్రమ్, ఎన్నారై మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కావడం విశేషం.ఇలాంటి మంచి పనిలో తనతో సహకరించినందుకు ఆ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు మహేష్ బాబు.







