దర్శకుడు శ్రీనువైట్లకి బ్యాడ్ టైం నడుస్తోంది .దూకుడు చిత్రంతో ఒక్కసారిగా అత్యంత డిమాండ్ ఉన్న డైరెక్టర్ గా ఎదిగిన వైట్ల , మళ్ళీ అదే మహేష్ బాబుతో తీసిన ఆగడు చిత్రంతో చెడ్డపేరు తెచ్చుకున్నారు .
అతికష్టం మీద లాకొచ్చిన బ్రూస్ లీ కూడా ఘోరంగా విఫలమవడంతో యువహీరో వరుణ్ తేజ్ ని పట్టుకున్నారు.ఎప్పుడో మొదలుకావాల్సిన ఈ సినిమా , రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది .మే 20న షూటింగ్ మొదలుపెడతామన్నారు కాని పెట్టలేదు .
ఇంతలో వరుణ్ తేజ్ వైట్ల మీద ఇంటరెస్ట్ చూపించట్లేదని, శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో అదే తన తదుపరి చిత్రంగా ఫిక్స్ అయిపోయాడని మీడియాలో వార్తలు మొదలయ్యాయి .అయితే , వరుణ్ తేజ్ – వైట్ల “మిస్టర్ ” చిత్రానికి రచన అందిస్తున్న గోపీమోహన్ ఈ వార్తల్ని ఖండించారు .
సమయమే నడుస్తున్న గాసిప్స్ కి సమాధానం చెబుతుందని చెప్పారు .అయితే ఈ లెక్కన, శ్రీనువైట్ల – వరుణ్ తేజ్ సినిమా క్యాన్సిల్ అని వచ్చిన వార్త అవాస్తవం అన్నమాట .అయిందేదో అయిపోయింది , ఇక సినిమా మొదలు పెట్టెయ్యండి .







