మహేష్ బాబు బ్రహ్మోత్సవం నిన్నే సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికేట్ సంపాదించుకుంది.ఇక ఎలాంటి అనుమానాలు లేకుండా మే 20న బాక్సాఫీస్ మీదకి దూకుతాడు సూపర్ స్టార్.
అయితే ఈ చిత్రానికి నైజాంలో బెనిఫిట్ షోలు పడటం అనుమానంగా మారింది.రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేసినా, పోలీసు డిపార్టుమెంటు పర్మిషన్ ఇవ్వట్లేదు.
ఇలాంటి పరిస్థితిని ముందే పసిగట్టిన నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అభిషేక్ పిక్చర్స్, తొలిరోజు తెలంగాణవ్యాప్తంగా ఉదయం ఆటలు ప్లాన్ చేసారు.ఇప్పటివరకు లేనట్టుగా ఉదయం 8:10 గంటలకు బ్రహ్మోత్సవం మొదటి ఆట మొదలవుతుంది తెలంగాణ జిల్లాల్లో.
ఈ లెక్కన తొలిరోజు అయిదు ఆటలు ఉంటాయి.హైదరబాద్ వరకు సరే, ఎందుకంటే పట్టణ జనాభాకు ఈ కొత్త మార్పు ఇంటర్నెట్ వాడకంతో తెలిసిపోతుంది.మరి మిగితావారి పరిస్థితో ?br/>
కేవలం ఇంటర్నెట్ వినియోగదారులతో సినిమా హాళ్ళు నిండవు కదా.మిగిలిఉన్న రెండురోజుల సమయంలో ఉదయం 8:10 గంటలకు కూడా ఒక ఆట ఉందని జనాభాకి సమాచారం ఎంతవరకు చేరుస్తారో, ఉదయం ఆటకు జనాలు ఎంతవరకు బయలుదేరుతారో.br/>
ఎదైనా తేడా కొడితే ఈ ప్రయోగానికి మహేష్ బలవుతాడు, మళ్ళీ ఏదైనా పెద్ద సినిమాకు ఇదే పద్ధతి ఫాలో అయితే వాళ్ళు మాత్రం లాభపడతారు.ఎందుకంటే అప్పటివరకు ఆడియెన్స్ కి ఈ ఉదయం స్పెషల్ ఆటల మీద పూర్తి సమాచారం ఉంటుంది.







