మారుతి సినిమాలు కామెడికి పెట్టింది పేరు.తొలి చిత్రం ఈరోజుల్లో కానివ్వండి, భారి లాభాలు సంపాదించిన ప్రేమకథాచిత్రమ్ కానివ్వండి, మొన్నటికి మొన్న సంచలన కలెక్షన్లు సాధించిన భలే భలే మొగాడివోయ్ కానివ్వండి, మారుతి సినిమాకి వెళితే కడుపుబ్బా నవ్వుకోవచ్చు ప్రేక్షకుడు.
ఇక అలాంటి మారుతికి వెంకటేష్ లాంటి హీరో దొరికితే ఇంకేమైనా ఉందా.చాలాకాలం తరువాత పూర్తిస్థాయి కామెడి సినిమాలో నటిస్తున్నారు విక్టరి వెంకటేష్.
ఈ ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రమే బాబు బంగారం.
ఇటివలే ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ లో పాల్గొన్న కామెడియన్ వెన్నెల కిషోర్, ఎగబడి ఎగబడి నవ్వాడంట.
ఇంకా డబ్బింగ్, రీరికార్డింగ్, మిక్సింగ్ పూర్తి కాకుండానే అంతలా నవ్వాడంటే, తెరపై చూసి మనమెంత నవ్వుతామో.
ఇంతకి వెన్నెల కిషోర్ అంతలా ఎందుకు నవ్వాడో చెప్పలేదు కదూ.బాబు బంగారం లో కామెడియన్ పృధ్వీ మీద నాన్నకు ప్రేమతో పేరడి తీశారు.అది చూసి కిషోర్ నవ్వు ఆపులేకపోయాడు.
ఆ సన్నివేశాలకి అడియెన్స్ పగలబడి నవ్వుకుంటారని చూసినవారంతా చెబుతున్నారు.







