పరుగుల పందంలో పాల్గొనాలంటే యుక్త వయసులో ఉండే యువతి యువకులకే సాధ్యం అని అందరూ భావిస్తారు.వయసు పెరిగే కొద్దీ పరుగులు తీయడం అసాధ్యం.
కానీ 95 ఏళ్ల బామ్మ పరుగుల పోటీలలో మెడల్స్ సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ కోసం పోలాండ్ కు( Poland ) వెళ్ళింది.భగవాని దేవి గత సంవత్సరం ఫిన్లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తి గోల్డ్ మెడల్ సాధించింది.ఈ వంద మీటర్ల దూరం టీనేజ్ పిల్లలైతే 15 సెకన్లలో, 20 ఏళ్లు దాటిన వాళ్ళు అయితే 20 సెకన్లలో పరుగెత్తుతారు.అందుకే ఈమె పరుగుల అవ్వగా రికార్డ్ పొందింది.
ఈ సంవత్సరం మార్చి 25 నుండి మార్చి 31 వరకు జరిగే పోలాండ్ లోని టోరౌలో జరిగే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొననుంది.
ఇక భగవాని దేవిది( Bhagwani devi ) హర్యానాలోని ఖేడ్క అనే గ్రామం.12 సంవత్సరాల వయసులో వివాహం అయ్యి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.కానీ 30 ఏళ్లకే భర్త చనిపోవడం, పుట్టిన ముగ్గురు పిల్లలు ఇద్దరు చనిపోవడంతో వ్యవసాయ పనులు చేస్తూ ఒక్క కొడుకును పోషించుకుంది.
కొడుకుకు ఉన్నత చదువులు చదివించడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చింది.ఇక కుమారునికి వివాహం చేయడంతో ముగ్గురు మనవళ్లకు నానమ్మ అయింది.ఈ ముగ్గురు మనవళ్ళలో వికాస్ డాగర్( Vikas Dagar ) అనే మనవడు క్రీడలలో గుర్తింపు పొందాడు.ఇతడే తన నానమ్మలో క్రీడా స్ఫూర్తిని గమనించాడు.
ఒకరోజు తన షాట్ పుట్ ను తన నానమ్మ విసరడం చూసి ఆశ్చర్యపోయి, తన నానమ్మకు కోచ్ గా మారి అథ్లెట్స్ కు శిక్షణ ఇచ్చాడు.95 ఏళ్ల వయసులో కూడా పూర్తి ఆరోగ్యంగా, చురుకుగా ఉండి, ఎంత పరుగెత్తిన కూడా అలసిపోదు.గత ఏడాది తనకేమైనా అవుతుందని భయపడవద్దు.దేశం కోసం పరుగెత్తి ప్రాణం విడిచిన నాకు గర్వకారణమే అంటూ ఫిన్లాండ్ లో గోల్డ్ మెడల్ సాధించి విశేష గుర్తింపు పొందింది.
ఈసారి కూడా అదే స్ఫూర్తితో పోటీలలో పాల్గొనడం కోసం పోలాండ్ కు వెళ్లింది.