అమెరికాలో “ఆ తొమ్మిది” మంది అరెస్ట్..వారి రీజన్ వింటే..!!!

అమెరికాలోని టెక్సాస్ నగరంలో పోలీసులు తొమ్మిది మంది మిత్రులని అరెస్ట్ చేశారు.వీరందరూ అసాంఘీక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని తెలిసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

అయితే ఎందుకు ఇలా చేస్తున్నారని పోలీసులు ప్రశ్నిస్తే తెలుగు సినిమాలో సాయి కుమార్ డైలాగ్ ఒకటి గుర్తొచ్చే డైలాగ్ చెప్పారు.అదేంటంటే.

అవసరాలకోసం ఈ పని చేయక తప్పలేదు అంటూ తాపీగా సమాధానం ఇచ్చారట.ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటి.?? ఎందుకు వారు అడ్డదార్లు తొక్కారు అనే వివరాలలోకి వెళ్తే.నిఘా వర్గాల సమాచారం ప్రకారం టెక్సాస్ పోలీసులు ఆ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

వారి చర్యలపై విచారణ జరుపగా డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి పనులు చేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది.

Advertisement

వీరిలో ఒకరు డ్రగ్స్ సంపాదిస్తే మిగిలిన వారు వాటిని రవాణా చేస్తారని పోలీసుల విచారణలో తేలిందట.ఆ తర్వాత డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బుని చాలా బ్యాంకు ఖాతాలకి మళ్ళిస్తారని దాంతో వారిని పట్టుకోవడం కష్టం అవుతోందని అంటున్నారు.వీరంతా కలిసి చాలా పకడ్బందీగా పథకం ప్రకారం ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే కేవలం మా అవసరాలకు డబ్బు చాలా అవసరం కాబట్టి అడ్డదారులు తొక్కక తప్పలేదని నిందితులు అంటున్నారట.

Advertisement

తాజా వార్తలు